హెల్ది అయిన చుక్క కూర ,చిలకడ దుంప కర్రీ ఎలా చేసుకోవాలి అంటే …!

-

ఏ కాలంలో నైనా ఆకు కూరలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అందరు ఆకు కూరలు తినరు. దీనికి కారణం ఆకు కూరలు అనగానే పప్పులో వేస్తే మాత్రమే తింటారు. ఇంకా ఎలా వండినా బాగోవు అనుకుంటారు. ఒకసారి చుక్క కూర, చిలకడ దుంప కూరని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.

చుక్క కూర, చిలకడ దుంప కర్రీ కి కావలసిన పదార్థాలు: చిలకడ దుంప ముక్కలు ¼ కప్పు, చుక్క కూర పేస్ట్ ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి రెండు, అల్లం, వెల్లుల్లి ముద్ద 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం: చిలకడ దుంపలు చిన్న ముక్కలుగా కోసి నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేగించి అందులో చుక్క కూర పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి వేగిన తర్వాత ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కూర దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లి దించుకోవాలి.అంతే చుక్క కూర ,చిలకడ దుంప కర్రీ రెడీ.

పోషక విలువలు: ప్రోటిన్స్ 1.2 గ్రా, కొవ్వు 0.4 గ్రా, కాల్షియం 20 మి. గ్రా, ఫాస్పరస్ 45 మి గ్రా, ఐరన్ 0.7 మి. గ్రా,ఇంకా మెగ్నీషియం, సోడియం, పొటాషియం, విటమిన్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news