పిల్లలకు ఇష్టమైన మింట్ లాలి పాప్స్ ఎలా చేసుకోవాలి అంటే …!

-

దేశం మొత్తం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ నేపధ్యంలో పిల్లలు, పెద్దలు అందరు ఇంట్లోనే ఉంటున్నారు. దీనితో పిల్లలు స్నాక్స్ కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్యకరమైన మింట్ లాలి పాప్స్ ని ఇంట్లోనే చేసి పెట్టండి. బేకరీల్లో దొరికే వాటి కన్నా ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ లాలి పాప్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మింట్ లాలి పాప్స్ తయారీకి కావలసిన పదార్థాలు: బెల్లం తురుము 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, డ్రై రోస్ట్ చేసిన నువ్వులు 2 స్పూన్స్, పుదీనా 2 కప్పులు, జీడిపప్పు 1 కప్పు, టూత్ పిక్స్ కొన్ని, నీరు 1 గ్లాస్.

తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి శుభ్రపరచిన పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి వడకట్టాలి. ఆ నీటిలో బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం బాగా ముదురు పాకం వచ్చాక జీడిపప్పు పలుకులు, ఓట్స్, నువ్వులు వేయాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టాలి. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని బిళ్ళల్లా ఒత్తుకుని టూత్ పిక్స్ గుచ్చితే సరిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మింట్ లాలి పాప్స్ సిద్దం.

దీనిలో పోషక విలువలు: కేలరీస్ 70, ఫాట్ 0.9 g, కొలెస్ట్రాల్ 0g, కార్బోహైడ్రేట్స్ 15 g, పైబర్ 8 g, ప్రోటీన్ 3.8 g, సోడియం 31 mg, పొటాషియం 569mg.

Read more RELATED
Recommended to you

Latest news