హెల్ది అయిన రాగి, డేట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

-

ఈ రోజులో పిల్లలు బేకరీ ఫుడ్స్ కి అలవాటుపడి ఇంట్లో చేసే మంచి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సాధారణంగా పిల్లలకు ఎక్కువ స్వీట్స్ అంటే ఇష్టం కనుక బేకరీలలో చేసే పంచదార వంటలను కాకుండా ఇంటిలో ఇలా పంచదార బదులు డేట్స్ తో లడ్డు చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. అయితే ఈ లడ్డులో డేట్స్ తో పాటు రాగులను కూడా వేస్తే కావలసినన్ని పోషకాలు అందుతాయి.

రాగులు, డేట్స్ లడ్డుకి కావలసిన పదార్థాలు: రాగులు 1 కప్పు వేయించి పొడి చేయాలి. గింజలు లేని డేట్స్ 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి , యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు.

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని దానిలో రాగి పిండి వేసి అందులో నెయ్యి వేసి కలపాలి. అందులో యాలకుల పొడి, కొబ్బరి పొడి, కట్ చేసి పెట్టిన డేట్స్ వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ అయిన మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డులు చుట్టుకోవాలి. వీటిపై జీడి పప్పు తో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో హెల్ది అయిన రాగి, డేట్స్ లడ్డు రెడీ.

పోషక విలువలు: కేలరీస్ 135, ప్రోటీన్స్ 2 గ్రా, కొవ్వు 67 గ్రా, కొలెస్ట్రాల్ 300గ్రా, కార్బోహైడ్రేట్స్ 72 గ్రా, ఐరన్ 17.5 మి .గ్రా, కాల్షియం 345 మి .గ్రా.

Read more RELATED
Recommended to you

Latest news