అంతర్జాతీయ టీ దినోత్సవాని ప్రతీ ఏడాది మే 21వ తేదీన జరుపుకుంటారు, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రకారం ఈ రోజుని ఇంటర్నేషనల్ టీ డే గా జరుపుతున్నారు. ఐతే టీ ని అధికంగా సేవించే ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, మలావి, ఇండోనేషియా, వియత్నాం, ఉగాండా మొదలగు దేశాల్లో అంతర్జాతీత టీ డేని డిసెంబరు 15వ తేదీన జరుపుతారు. ఒకే పానీయం గురించి అంతర్జాతీయంగా రెండు దినోత్సవాలు ఉండడం విచిత్రమే.
భారతదేశంలో దాదాపు చాలామందికి టీ తోనే తెల్లవారుతుంది. పొద్దున్న లేవగానే తాగే పానీయం తేనీరే (టీ) ఉంటుంది. ఐతే టీ విషయంలో చాలామంది చాలారకాల సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల వెనక సమధానాలను తెలుసుకుననే ప్రయత్నం చేద్దాం.
అపోహ- టీ కి ఎక్స్పైరీ ఉండదు
ఇది నిజం కాదు. వంటిట్లో ఉండే చాలా విషయాల మాదిరి టీ కి కూడా ఎక్పైరీ ఉంటుంది. మీరు తెచ్చుకున్న టీ పౌడర్ వాసన మారినట్లయితే దాన్ని విసిరివేయడమే మంచిది. టీ కి కూడా ఎక్పైరీ ఉంటుంది.
అపోహ – గ్రీన్ టీ వల్ల కొవ్వు కరిగిపోతుంది
గ్రీన్ టీ తాగడం వల్ల కొవ్వ్వు కరిగిపోయి బరువు తగ్గుతారనేది నిజమే. కానీ, గ్రీన్ టీ తాగుతూ రోజంతా మంచం మీద పడుకుంటూ ఇష్టం వచ్చింది తింటూ కూర్చుంటే మాత్రం ఎప్పటికీ బరువు తగ్గరు. వ్యాయామం సహా చేయాల్సిన అన్నింటినీ చేస్తుంటేనే కొవ్వ్వు తగ్గుతుందని గుర్తుంచుకోండి.
అపోహ: టీకి పాలు జోడించడం వల్ల టీ ప్రయోజనాలు తగ్గుతాయి
ఇది నిజం కాదు. బ్లాక్ టీ బలమైనదే. కానీ పాలని జోడించడం వల్ల దాని శక్తి పూర్తిగా తగ్గిపోతుందనేది నిజం కాదు. పాల ద్వారా టీలోని తియ్యదనం మరింత పెరుగుతుంది.
అపోహ: కెఫైన్ లేని టీలో అసలు కెఫైన్ ఉండదు
ఎంత కెఫైన్ లేని తాగాలనుకున్నా అందులో కొద్దిగానైనా కెఫైన్ ఉండి తీరుతుంది. అసలు పూర్తిగా కెఫైన్ లేని టీ తాగాలంటే ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన టీ తాగాలి.
అపోహ: టీ వల్ల డీహైడ్రేషన్ కలుగుతుంది
ఎక్కువ టీ తాగడం వల్ల ఎక్కువ మూత్ర విసర్జన కలుగుతుంది. దీనికి పాలు కలుపుతారు కాబట్టి ఇది డిహైడ్రేషన్ కి గురి చేయదు. కానీ ఏదైనా మితంగా తీసుకోవాలనేది గుర్తించుకోండి.