కాశ్మీర్ ఛాయ్!

-

కాశ్మీర్ ప్రజలు ఈ ఛాయ్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో, రాత్రిపూట డిన్నర్ అయ్యాక తీసుకుంటారు. దీన్ని నూన్ ఛాయ్ అని పిలుస్తారు. అలాంటి కాశ్మీర్ టీని ఎలా చేస్తారో చూద్దాం.
కావలసినవి :
గ్రీన్ టీ ఆకులు : 2 టేబుల్‌స్పూన్లు
యాలకులు : 4
పాలు : 3 కప్పులు
చక్కెర : సరిపడా
బేకింగ్‌సోడా : చిటికెడు
దాల్చిన చెక్క : అంగుళం ముక్క
అనాసపువ్వు : 1
లవంగాలు : 3

తయారీ :
మందపాటి గిన్నెలో ఆరు కప్పుల మంచినీళ్లు పోసి సిమ్‌లో మరిగించాలి. అందులో గ్రీన్ టీ ఆకు వేసి, మరో పదినిమిషాలు సిమ్‌లోనే మరిగించాలి. తర్వాత సోడా వేసుకోవాలి. ఇప్పుడు టీ రంగు గులాబారంగులోకి మారిపోతుంది. వెంటనే మిగిలిన కప్పుల చల్లని నీళ్లు పోసి వడపోయాలి. ఇప్పుడు వడబోసిన టీ కషాయంలో యాలకులపొడి, దాల్చినచెక్క లవంగాలు, అనాసపువ్వు వేసి మూత పెట్టి సగమయ్యేవరకూ మరిగించాలి. తర్వాత నెమ్మదిగా పాలు పోసి బాగా కలుపాలి. చివరగా చిటికెడు ఉప్పు, పంచదార వేస్తే నోరూరించే కాశ్మీరీ చాయ్ రెడీ. దీన్ని బాదం, పిస్తాలతో కలిపి సర్వ్ చేస్తే టేస్ట్ అదిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news