లెమన్ కట్టామిట్టా.. అస్సలేం తినాలనిపించనప్పుడు ఇది ఉంటే…ఆహా..!

-

ప్రకృతి వైద్య విధానంలో ఉప్పులేకుండా నిమ్మకాయనే వాడుతుంటారు కదా.. ఉసిరికాయలతో పచ్చడి పెట్టినట్లు.. నిమ్మకాయతో కూడా కట్టామిట్టా చేద్దామా..అప్పుడప్పుడు తింటుంటే.. లాలాజం బాగా వస్తుంది. మౌత్ ఫ్రషనర్గా కూడా పనిచేస్తుంది. దంతాల ఇన్ఫెక్షన్ రాకుండా కూడా బాగా పనిచేస్తుంది. ఓ హడావిడి లేకుండా.. సింపుల్గా టేస్టీగా లెమన్ కట్టామిట్టా ఎలా చేసుకోవాలో చూద్దామా..!

లెమన్ కట్టామిట్టా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు..

పసుపురంగులోకి వచ్చిన నిమ్మపండ్లు ఐదు
తేనె అరకప్పు
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
మిరియాలు ఒక టేబుల్ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
మెంతులు ఒక టీ స్పూన్
సోంపు ఒక టీ స్పూన్
మీగడ ఒక టీ స్పూన్
ఇంగువ పొడి కొద్దిగా
పసుపు కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని పొయ్యిమీద పెట్టి అందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు, సోంపు, మిరయాలు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత వాటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న నాన్ స్టిక్ గిన్నె తీసుకుని పొయ్యిమీద పెట్టి మీగడ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, పసుపు వేసి అవి వేగిన తర్వాత.. ఒక నిమ్మకాయను ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుని అలా ఐదు నిమ్మకాయలను కట్ చేసుకుని అవి వేసేసేయండి.

కొద్దిగా వేడెక్కనించి.. అందులో నీళ్లు పోసి ఉడకనివ్వండి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత తేనె వేసి 10-15 ఉడకనివ్వండి. నిమ్మకాయ ముక్కల్లో ఉండే చేదు తగ్గిపోతుంది. పాకంలా అవుతుంది. అందులో మనం తయారు చేసుకున్న మసాల పొడి వేసి తిప్పేయడమే..తియ్యతియ్యగా పుల్లపుల్లగా బాగుంటుంది. కూరలు బాగోనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నోరు టేస్ట్ పోతుంది. అలాంటప్పుడు కూడా ఇది వేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే.. సూపర్ ఉంటుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version