సమ్మర్ స్పెషల్ పుదీనా డ్రింక్ ని ఇలా ఈజీగా చేసుకోండి..!

-

పుదీనా తీసుకోవడం వల్ల కూల్ సెన్సేషన్ మనకి ఉంటుంది. అలానే పుదీనా కడుపు నొప్పిని తొలగిస్తుంది మరియు సరైన జీర్ణానికి సహాయం చేస్తుంది. పుదీనాని కాక్ టైల్స్, మొజిటోస్ మొదలైన వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఏ ఫ్రెష్ డ్రింక్ చేసిన పుదీనా తప్పక యాడ్ చేసుకుంటే బాగుంటుంది.

పైగా ఈ వేసవి ఎండలుని తరిమి కొట్టాలంటే పొదిగిన తోనే సాధ్యం. అయితే ఈ రోజు మనం చల్లని పుదీనా డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం..! దీని వల్ల మంచిగా రిలీఫ్ గా ఉంటుంది. పైగా ఎండల నుంచి మంచి ఉపశమనం కూడా లభిస్తుంది.

సమ్మర్ లో షర్బత్, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, లస్సి ఇటువంటి తీసుకుంటూనే ఉంటాం. అయితే కాస్త రొటీన్ కి భిన్నంగా ఇటువంటివి కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు. పుదీనా డ్రింక్ చేసుకోవడం కూడా సులభమే. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దాని కోసం చూసేద్దాం..!

పుదీనా డ్రింక్ కి కావలసిన పదార్ధాలు:

ఒక కట్ట పుదీనా
ఒక చిన్న కట్ట కొత్తిమీర
కొద్దిగా అల్లం
యాలుకలు
50 నుండి 60 గ్రాములు బెల్లం
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
నీళ్లు

పుదీనా డ్రింక్ ని తయారు చేసే విధానం:

ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని దానిలో నీళ్ళు వేసి కొద్దిగా బెల్లం కూడా వేయండి అది కరిగే వరకూ అలాగే ఉంచండి. ఇప్పుడు మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, అల్లం, యాలుకలు, నిమ్మరసం వేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ లో 750ml నీళ్లు పోయండి. ఇప్పుడు దీనిని వడకట్టి కరిగించుకున్న బెల్లాన్ని కూడా దీనిలో వేసుకుని బాగా మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ తో సర్వ్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news