తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో కేసులు భారీగా విజృంభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సెకండ్ వేవ్ లో ఇంట్లో ఒక్కరికి కరోనా వచ్చినా ఇంట్లో అందరికీ వచ్చినట్టే అని ఆయన అన్నారు. గతంలో ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వారికి సోకకుండా ఉండేదని, కానీ ఇప్పుడు ఒకరికి వస్తే ఇంట్లో ఉన్న పదిమందికి సోకుతుందని ఆయన పేర్కొన్నారు. గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంనట్లుగా భావిస్తున్నామని పేర్కొన్న ఆయన, ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకుంటేనే కరోనా బారి నుంచి బయటపడే అవకాశం ఉందని అన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనే బెడ్ల కొరత ఉందని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు ఖాళీగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బెడ్ కావలసినవారు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదిస్తే ఖాళీగా ఉన్న బెడ్ వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. పండుగలు ఎప్పుడైనా వస్తాయని కానీ జీవితం ఒక్కసారి పోతే మరోసారి తిరిగి రాదని అని చెప్పుకొచ్చారు.