మిక్సిడ్ దాల్ ఇడ్లీ.. రవ్వతో చేసే వాటికంటే వంద రెట్లు బెటర్..!

-

డైలీ టిఫెన్ లో ఇడ్లీలు, దోశెలు తినడం చాలామంది చేస్తుంటారు. కానీ అసలు ఇడ్లీలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. తెల్లటి అన్నమే మంచిది కాదురా అంటే.. ఇక రైస్ తో చేసిన రవ్వతో ఇడ్లీ ఎలా మంచిది అవుతుందండి. పోషకాలు లేని ఉప్పుడురవ్వ తినడం వల్ల జబ్బులు వస్తాయి కానీ ఎలాంటి లాభం ఉండదు. ఈరోజు మనం రవ్వతో పనిలేకుండా.. ఎక్కువ పోషకాలు ఉండే పప్పులతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం.

మిక్సిడ్ దాల్ ఇడ్లీకి కావల్సిన పదార్థాలు

మైసూరు పప్పు
కందిపప్పు
పెసరపప్పు
పొట్టుతీయని మినపప్పు
పచ్చిశనగపప్పు
ముడిబియ్యం
పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
పచ్చిశనగపప్పు ఒక టీస్పూన్
ఆవాలు ఒక టీస్పూన్
మీగడ ఒక టీ స్పూన్
వంటసోడా ఒక టీ స్పూన్
కరివేపాకు, కొత్తిమీర
ఇంగువ కొద్దిగా

తయారు చేసే విధానం:

ఆరు రకాల పప్పు ధాన్యాలను అరకప్పు కొలతతో తీసుకుని.. ఒక నైట్ అంతా నానపెట్టుకుని తెల్లారి కడిగేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిలో లెమన్ జ్యూస్, వంటసోడా వేసుకుని కలపండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మీగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ పొడి వేసుకుని ఆ తాలింపు తీసుకొచ్చి.. గ్రైండ్ చేసి పెట్టిన ఇడ్లీ పిండిలో వేసుకోని.. ఇడ్లీ ప్లేట్స కు మీగడ రాసి ఇడ్లీ వేసుకుని ఆవిరి మీద ఉడకనివ్వండి. 10-15 నిమిషాల తర్వాత వేడి వేడి ఇడ్లీ రెడీ అవుతుంది.

వీటన్నింటిలో బలం 340-350 కాలరీల శక్తి ఉంటుంది. అన్నీ 25 శాతం ప్రోటీన్ ఉన్నవే. మంచి బలం ఉన్నది కాబట్టి. పిల్లలకు, ముసలివారికి ఇవి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. రవ్వతో చేసిన ఇడ్లీలు తినేకంటే.. ఇలాంటి ఇడ్లీలు తినడం వల్ల ఎదిగే పిల్లలకు చాలా మంచి పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news