పాలక్ పకోడీ.. ఆయిల్ అక్కర్లేదు.. టేస్ట్ లో డౌటేలేదు..!

-

పకోడీలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ఇంట్లో వేసుకుని తిన్నాక మిగిలిన వాటిని ఏ పులుసుకూరో లేక మజ్జిగలో వేసుకునే తింటారు. మరి అలాంటి పకోడీలతో దహీ కర్రీ చేసుకుని తింటే.. ఇక్కడ ఇంకో హైలెట్ ఏంటో తెలుసా..ఈ పకోడీలను నూనె లేకుండా చేస్తారు. అలా అని చప్పుగా, చెత్తగా ఉంటాయ్ అనుకుంటారేమో.. నెంబర్ వన్ టేస్ట్ ఉంటాయి. కావాలంటే మీరు చేసి చూడండి.

 

పాలక్ పకోడి దహీ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు

పాలకూర ఒకటిన్నర కప్పు
పెరుగు ఒకటిన్నర కప్పు
శనగపిండి అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
వాము ఒక టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
వంట సోడా ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
కరివేపాకు కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, వాము, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, వంటసోడా, లెమన్ జూస్ కొద్దిగా, శనగపిండితో కలుపుకుంటూ గట్టి పెరుగు వేసుకుని గట్టిగా కలుపుకోండి. నాన్ స్టిక్ గుంట ప్లేట్ ఉంటుంది కదా.. అందులో ఈ పిండి ఉండలు చేసుకుని వేసి సిమ్ లో కాల్చుకోండి.. ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు కూడా కాల్చుకోండి. మీగడ రాసుకుని ఇలా రెండు వైపులా కాల్చండి. అవి అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. కర్రీకి ఒక బౌల్ లో శనగపిండి, పెరుగు వేసి కలపండి. అందులోనే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపండి.

పొయ్యిమీద చిన్న నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా మీగడ వేసి దోరగా వేగనివ్వండి. అందులోనే లైట్ గా పసుపు వేసి.. శనగపిండి కలిపిన పెరుగును వేసి తిప్పండి. ఇది వేడెక్కి కాస్త ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న పకోడీలు వేసుకుని తిప్పండి. పది నిమిషాలు అలా ఉడకనించి.. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని తీసేయడమే.. సూపర్ టేస్ట్ కమ్ హెల్తీ కర్రీ రెడీ.. ఈవినింగ్ స్నాక్ గా తినేయొచ్చు. రక్తనాళాలకు, రక్తానికి ఇది చాలా మంచిది. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news