వేసవి: మామిడితో తయారయ్యే ఐస్ క్రీమ్.. ఇంట్లోనే చేసుకోండిలా..

-

వేసవి వేడిలో చల్లని ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. చల్లని క్రీము గొంతులోకి దిగుతుంటే శరీరమంతా చల్లగా అయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం పరిస్థితులు బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేలా లేవు. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అందువల్ల చల్లగా అనిపించే ఐస్ క్రీముని ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిందే. ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇక్కడ రెసిపీ ఇస్తున్నాం. వేసవిలో దొరికే మామిడి పండుతో చల్లన్ని ఐస్ క్రీమ్ తయారీ మీకోసం.

కావాల్సిన పదార్థాలు

6- మామిడి పండ్లు
2- చాల్చిన చెక్క ముక్కలు
1- కప్పు పుదీనా ఆకులు
4-నల్లమిరియలు
1- టేబుల్ స్పూన్ ఉప్పు
1- కప్పు చక్కెర
1-టేబుల్ స్పూన్ సోంపు గింజలు
1/4-టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి
1/4 నల్ల ఉప్పు
1+1/2 కప్పుల మంచినీళ్ళు

తయారీ పద్దతి

ముందుగా మామిడికాయలను తీసుకుని వాటి తోలు తీసివేసి, ఇష్టం ఉన్నట్టుగా ముక్కలుగా కోసి ఒక పాత్రలో వేయాలి. అందులో నీళ్ళు పోసి చిన్న మంట మీద పెట్టాలి.

ఆ తర్వాత నల్ల మిరియాలు, చక్కెర, యాలకులు, సోంఫు గింజలు వేయాలి. ఈ మిశ్రమం అంతా ఒక జామ్ మాదిరిగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఒక పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి.

పూర్తిగా జామ్ లాగా అయ్యాక పొయ్యి మీద నుండి తీసివేసి పక్కన పెట్టాలి. బాగా చల్లారే దాకా అలాగే ఉంచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరే పాత్రలోకి తీసుకోవాలి.

ఇప్పుడు నీళ్ళు, నల్ల ఉప్పు, పుదీనాలని బాగా కలపాలి. ఆ తర్వాత దీనికి ఐస్ క్రీము పుల్లలని తగిలించి ఒక రాత్రిపూట రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. అంతే మీకు కావాల్సిన మామిడి ఐస్ క్రీము తయారైనట్టే.

Read more RELATED
Recommended to you

Latest news