బరువు తగ్గడానికి మేలు చేసే సుగంధ ద్రవ్యాలు..

-

భారత దేశ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలన్నింటిలోకి భారతదేశం సుగంధ ద్రవ్యాలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మన వంటకాల్లో ప్రతి రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మన రోజు వారీ డైట్ లో సుగంధ ద్రవ్యాలు భాగం కావడం వల్ల ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు. మనం రోజూ తినే సుగంధ ద్రవ్యాలు అధిక బరువుని తగ్గిస్తాయి.

పసుపు

జీర్ణశక్తిని పెంచడంతో జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆహారంలో పసుపును భాగం చేసుకుంటే అనేక అనర్థాల నుండి బయటపడవచ్చు. అధిక కొవ్వును కరిగిస్తుంది. పసుపుతో చేసిన టీ గానీ, లేదా ఇంకా ఇతర పానీయాల్లో పసుపు తీసుకోవడం మంచిది.

దాల్చిన చెక్క

బెరడు వంటి పదార్థం అయిన దాల్చిన చెక్క వలన క్లిగే ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనది రోగ నిరోధక శక్తి పెరగడం, ఆడవాళ్ళకి రుతు క్రమంలో ఎక్కువ నొప్పి కలగకుండా చేస్తుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది. రక్తంలో ఇన్సులిన్ ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే కొవ్వు కరిగించడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది.

నల్ల మిరియాలు

నల్ల మిరియాల టీ చేసె మేలు అంతా ఇంతా కాదు. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి నల్ల మిరియాలు రక్షణనిస్తాయి. శరీరానికి పోషకాలని సరైన పాళ్ళలో అందిస్తాయి. రోగ నిరోధక శక్తి పెంచుతాయి. అంతే కాదు బరువు పెరుగుతున్న వారికి నల్ల మిరియాలు చక్కటి ఔషధం లాగా పనిచేస్తుంది.

ఏలకులు

జీర్ణక్రియని మెరుగుపరిచి కొవ్వు కరిగించడంలో ఏలకులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. టీ తాగే వారు అందులో ఏలకులు కలుపుకుంటే మంచిది. రోజూ 3నుండి 4ఏలకులు నమిలినా మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news