నోరూరించే గులాబ్ జామున్ తయారు చేద్దామా?

-

గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ ఒకటి, చెక్కర, నీళ్లు, యాలకుల పొడి, కొంచెం నూనె ఉంటే చాలు వేడి వేడి గులాబీ జామున్ తయారు చేసుకోవచ్చు.

హా… చూడగానే నోరూరుతోంది కదా. గులాబ్ జామున్ అంటే అంతే మరి. వాటిని చూస్తే షుగర్ ఉన్నవాళ్లు కూడా కంట్రోల్ చేసుకోరు. అబ్బ.. ఏమన్నా కానీ కానీ.. ఒక్కటైనా నోట్లో వేసుకోవాల్సిందే. టేస్ట్ చూడాల్సిందే అంటారు. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే గులాబ్ జామున్ ను ఇప్పుడు తయారు చేద్దాం పదండి.

గులాబ్ జామున్ తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ ఒకటి, చెక్కర, నీళ్లు, యాలకుల పొడి, కొంచెం నూనె ఉంటే చాలు వేడి వేడి గులాబీ జామున్ తయారు చేసుకోవచ్చు.

Gulab Jamun preparation

తయారు చేసే విధానం..

ముందుగా ఓ ప్లేట్ తీసుకొని దాంట్లో గులాబ్ జామున్ పౌడర్ వేయండి. దాంట్లో కొన్ని నీళ్లు పోసి పిండిని ముద్దలా కలపండి. దాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి. ఓ గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి సరిపడ చెక్కర వేసుకోండి. పాకం వచ్చేదాక దాన్ని వేడి చేయండి. పాకం పట్టాక దాన్ని పక్కన బెట్టండి. గులాబ్ జామున్ బాల్స్ ను వేడి వేడి ఆయిల్ వేసి వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వాటిని వేయించండి. వాటిని మరో గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న చెక్కర పాకాన్ని అందులో కలపండి. కాసేపు గులాబ్ జామున్లను అందులో నాననీయాలి. అంతే.. తర్వాత ఓ గిన్నెలో కొంచెం పాకం తీసుకొని గులాబ్ జామున్ వేసుకొని స్పూన్ తో లాగించేయడమే.

Read more RELATED
Recommended to you

Latest news