వేసవిలో కడుపుని తేలికగా ఉంచే అద్భుతమైన ఆహారాలు.. మీకోసమే..

-

వేసవి వేడిని తట్టుకోవడానికి కావాల్సినన్ని నీళ్ళు తాగడమే కాకుండా కావాల్సిన ఆహారాలు తీసుకోవడం కూడా ఉత్తమం. చెమట వల్ల శరీరంలోని శక్తి అంతా బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి, శక్తినిచ్చే ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ సీజన్లో ప్రధానమైన సమస్య, జీర్ణక్రియ. తీసుకున్నది సరిగ్గా జీర్ణం కాకుండా ఇబ్బందిపడడం చాలా మందికి మామూలే. అందుకే తేలికైన ఆహారాలని తీసుకోవాలని చెబుతుంటారు. వేసవిలో తీసుకోవాల్సిన తేలికైన ఆహారాలేంటో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

మామిడికాయతో చేసిన అన్నం

వేసవిలో మామిడికాయతో చేసిన అన్నం చాలా మంచిది. మామిడిపండుగా కాకముందే కాయని తీసుకుని పప్పులో వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు కడుపుని తేలికగా ఉంచుతుంది. పులుపుతో కూడిన తియ్యదనం పప్పుకి మరింత రుచిని కలిగిస్తుంది.

పులిహోర

పులుపుగా ఉండే పదార్థాలను తినడం వల్ల కడుపులో ఉండే విషపదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి. ఇందులో ఉండే చింతకాయ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. పులిహోర ఎలా చేయాలనేది తెలుగు వారికి చెప్పాల్సిన పనిలేదు.

టమాట రసం

మహారాష్ట్రలో ఎక్కువగా చేసుకునే టమాట రసం కడుపుని తేలికగా ఉంచుతుంది. తీపి, పులుపు కలిగిన రుచి నోరూరిస్తుంది. అన్నంలో టమాట రసం కలుపుకుని పక్కన అప్పడాలు నంజుకుని తింటే ఆ రుచే వేరు.

పూరీతో మామిడికాయ రసం

గుజరాతీలు ఎక్కువగా చేసే ఈ వంటకం కడుపుని చాలా తేలికగా ఉంచుతుంది. వేసవిలో మామిడి పళ్ళని ఎక్కువగా ఇష్టపడేవారు ఈ ఆహారాలని తీసుకుంటే బాగుంటుంది. మామిడి రసాన్ని చేసుకుని, అందులో పూరీతో తినడం బాగుంటుంది.

రెగ్యులర్ ఆహారాలను తినేవారు ఒక్కసారి ఈ ఆహారాలను ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version