ఇడ్లీలని బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది పైగా రుచిగా కూడా ఉంటుంది. అలానే ఈ సాఫ్ట్ ఇడ్లీలను ఒక సాంబార్ బౌల్ లో మరియు కారంగా ఉండే కొబ్బరి చట్నీతో తింటే.. ఇంక దాని రుచి మరెందులోనూ దొరకనంత అద్భుతంగా ఉంటుంది. ఈ నాలుగు రకాల ఇడ్లీలని మరి మీరు ఎప్పుడైనా తిన్నారా..? ఒకసారి చూసుకోండి..!
రవ్వ ఇడ్లీ:
రవ్వ ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఇళ్లల్లో కూడా చాలా మంది తయారు చేసుకుంటూ ఉంటారు. సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్ లో దీనిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఏది ఏమైనా ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అనే చెప్పాలి.
పోలు లేదా ప్లేట్ ఇడ్లీ:
ఇది ఏంటంటే ఒక పెద్ద ఇడ్లీ మాదిరి దీనిని తయారు చేస్తారు. ఇది రెండు మూడు ఇడ్లీలతో సమానం. ఇది చాలా సాఫ్ట్ గా మరియు పెద్దగా ఉంటుంది. ఇవి కొంచెం స్పాంజి గా ఉంటాయి కొబ్బరి చట్నీ తో తీసుకుంటే భలేగా ఉంటుంది.
పొట్టెక్కలు:
ముఖ్యంగా వీటిని పండుగల్లో చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వీటిని తయారు చేస్తూ ఉంటారు. పనస ఆకులని కుట్టి మధ్యలో ఇడ్లీ పిండి వేసి ఉడికిస్తారు. దీనిని సాంబార్, బొంబాయి చట్నీ లేదా అల్లం చట్నీ ఇలా దేనితో తీసుకున్న బాగుంటుంది. మన గోదావరి జిల్లాల్లో ఎక్కువగా దొరుకుతుంది.
పొడి ఇడ్లీలు:
ఇవి కూడా రుచిగా ఉంటాయి. చిన్నచిన్న ఇడ్లీలు వేసి దాని మీద చట్నీ పొడి వేస్తారు ఇది కారంగా రుచిగా ఉంటుంది. దీనిని కూడా తప్పక ట్రై చెయ్యాలి.