Keerthy Suresh : కీర్తి సురేశ్ గ్లామరస్ లుక్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

-

కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో మరోసారి సొగసుల బాణం విసిరింది. తాజాగా ఈ బ్యూటీ క్రీమ్ కలర్ గౌనులో సందడి చేసింది. ఈ ఔట్ ఫిట్ లో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది. చేతులు పైకెత్తి క్యూట్ స్మైల్ ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తన ఇన్ స్టా ఖాతాలో ఈ ఫొటోలు పోస్టు చేసిన కీర్తి…. ఫొటోషూట్ కోసం పోజులివ్వాల్సి వచ్చినప్పుడు.. అదే సమయంలో ఓ పెళ్లికి వెళ్లాల్సినప్పుడు.. అప్పుడై ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి వచ్చినప్పుడు.. నేను ఇలా ఉంటాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హార్ట్, కిస్ ఎమోజీస్ షేర్ చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. యూ ఆర్ లుకింగ్ లైక్ మై ఫ్యూచర్ అంటూ ఓ నెటిజన్ కీర్తి ఫొటోలకు కామెంట్ చేశాడు.

ఇక ఇటీవలే ఈ బ్యూటీ దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెన్నెల అనే పాత్రలో నటించింది అందర్నీ ఆకట్టుకుంది. డీ గ్లామర్ రోల్ లోనూ కీర్తి కుర్రాళ్లను అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news