కేసీఆర్‌ అభివృద్ధి రజినీకి అర్థమైంది..కానీ తెలంగాణ గజినీలకు అర్థం కావడంలేదు – హరీష్‌

-

హీరో రజినీకాంత్ నిన్న హైదరాబాద్ చూసి హైదరాబాద్ లా ఉన్నానా న్యూయార్క్ లా ఉన్నానా అన్నారని.. పక్క రాష్ట్రాల్లో ఉన్న రజినిలకు అర్థం అవుతుంది కానీ…ఇక్కడ ఉన్న గజినీలకు అర్థం కావట్లేదని ఆగ్రహించారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలు KCR ని దించేస్తాం అంటున్నాయి.. ఎందుకు దించాలే కేసీఆర్ ని… పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ని ఎందుకు దించుతారు అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.

రైతుకు నగలు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ అందుకు కేసీఆర్ గద్దె దించుతారా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ ని దించేస్తారా అని నిలదీశారు.లింగాయత్ లను OBC లో చేర్చాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపామని.. ఇక్కడ ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి OBC లను పట్టించుకోవట్లేదని ఆగ్రహించారు. కిషన్ రెడ్డి లింగాయత్ లను OBC లో చేర్చేందుకు కృషి చేయాలి.. బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే లింగాయత్ లను OBC లో చేర్చాలని కోరారు.
పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్ర పెట్టిన ఘనత KCR ది అని కొనియాడారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news