రేవంత్ రెడ్డి నా కొడకా.. నల్గొండ ప్రజలు నీ నాలుక కోస్తారు – గాదరి కిషోర్

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్. రేవంత్ రెడ్డి నా కొడకా… నాలుక కోస్తారు నల్గొండ ప్రజలు అంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చీకట్లో మాట్లాడితే ఆడనో… మగనో తెల్వదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గతంలో రేవంత్, ఉత్తమ్ పై విమర్శలు చేశారని.. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డీ తన ఆస్తుల గురించి ఇప్పటికే మాట్లాడారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా అంటే జానారెడ్డి దొంగలాగా పారిపోయాడని అన్నారు. నిన్న కాంగ్రెస్ మీటింగ్ లో నిరుద్యోగులు లేరని… విళ్ళే రాజకీయ నిరుద్యోగులని అన్నారు. కోమటి రెడ్డి మంత్రిగా ఉండి నల్గొండకు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కోసం ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. కాంగ్రెస్ నేతలది సొంత ఎజెండా.. బిఆర్ఎస్ ది ప్రజల ఎజెండా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news