ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్

-

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్​లో అజంతా శిల్పంలా పోజులిచ్చింది. బ్యాక్ గ్రౌండ్​లో గ్రీన్ ఫీల్డ్​.. వైట్ కలర్ ఔట్​ఫిట్​లో నభా.. అబ్బా ఎంత అందంగా కనిపిస్తుందో. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. నభా ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

ప్రకృతిలో నభా భలే ఎంజాయ్ చేస్తోంది అంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ ఎల్లోరా శిల్పంలా ఉంది కదూ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరేమో నభ కొంచెం స్లిమ్​ అయినట్టుందే అంటున్నారు. ఇంత అందం ఉన్నా ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదే అంటూ మరికొందరు నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.

నభా.. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి తెగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమా అవకాశాలేం లేవు. అయినా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టూ తరచూ అభిమానులతో టచ్​లో ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news