Rakul Preet Singh : మెరిసే ఔట్ ఫిట్ లో రకుల్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

-

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. గ్రీన్ కలర్ చమ్కీల లెహంగాలో రకుల్ మెరిసిపోతోంది. చమ్కీల మెరుపుల్లో.. లైట్ల వెలుగులో రకుల్ చిరునవ్వు చిందిస్తూ ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్ల మతిచెడిపోతోంది.

రకుల్ ఈ లెహంగాలో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. ఈ మధ్య ట్రెండీ ఔట్ ఫిట్లలో ఎక్కువగా సందడి చేస్తున్ ఈ బ్యూటీ తాజాగా సంప్రదాయ లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ లుక్ లో రకుల్ చాలా కూల్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా సినిమాలేం చేయడం లేదు. ఈ బ్యూటీ తన మకాం ముంబయికి మార్చి బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అక్కడే సినిమాలు చేస్తూ బీ టౌన్ ప్రేక్షకులను అలరిస్తోంది. కానీ రకుల్ ను తెలుగు యువకులు మాత్రం బాగా మిస్ అవుతున్నారు. త్వరగా టాలీవుడ్ లో కమ్ బ్యాక్ ఇచ్చేయమంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news