కెమెరాతో శ్రీలీల పోజులు.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు

-

టాలీవుడ్​లో హ్యాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల. ఈ భామ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తన బుట్టలో అరడజను సినిమా అవకాశాలను వేసుకుంది. ఇక ఆ సినిమా రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ అయినా.. ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ఇప్పటికే డజనుకుపైగా సినిమాలతో ఈ భామ బిజీబిజీగా గడుపుతోంది. వీటికి తోడు యాడ్స్, ఈవెంట్స్​లో పాల్గొంటూ.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను అక్షరాలా పాటిస్తోంది.

శ్రీలీల పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. అది ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమాతో బంపర్ హిట్ అందుకోవడమే కాదు ఏకంగా రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయింది శ్రీలీల. ఇక అప్పట్నుంచి ఈ బ్యూటీ ఛాన్సులే ఛాన్సులు. ప్రస్తుతం శ్రీలీల.. రామ్-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్- మహేశ్ సినిమాలో, బాలయ్య మూవీలో, విజయ్ దేవరకొండతో కలిసి ఇలా పలు సినిమాల్లో నటిస్తోంది.

షూటింగులతో ఇంత బిజీగా ఉన్నా శ్రీలీల సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గానే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ నైట్​వేర్​లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. షార్ట్ అండే షర్ట్​లో ఈ బ్యూటీ చేతిలో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపిస్తున్నట్లు క్యూట్ పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news