రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త..!

-

చాలా మందికి రేషన్ కార్డులు వున్నాయి. అయితే దేశంలోని 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఊరట కలిగించే నిర్ణయం ని కేంద్రం తీసుకుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ గడువు దగ్గర పడుతోంది. జూన్ 30, 2023తో రేషన్ కార్డు, ఆధార్ లింక్ గడువు అయిపోతోంది. అయితే ఆ గడువు ని మరో సారి ఎక్స్టెండ్ చేయనుంది. మరో 15 రోజుల్లో ఈ సమయం ముగిసి పోతోంది. అయితే మరో మూడు నెలల పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30, 2023 వరకు లింక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గెజిట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది.

అయితే రేషన్ లింక్ వున్నా వాళ్లకి మాత్రమే సాధ్యమవుతుంది. ఆధార్ అథెంటికేషన్ పూర్తయితేనే రేషన్ సరుకులు ని ఇస్తారు. సో తప్పనిసరిగా ఈ రెండింటిని అనుసంధానం చేయాలి. రేషన్ మోసాలకు చెక్ చెప్పవచ్చు. ఇక ఎలా లింక్ చెయ్యాలో కూడా చూసేద్దాం.

రేషన్ కార్డుతో ఆధార్ ని లింక్ చేయాలనుకుంటున్న వారు ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్‌కు వెళ్ళండి.
ఆ తరవాత ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేసేయండి.
రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ని సబ్మిట్ చేసేసి ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ని ఎంటర్ చేయాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ మీకొస్తుంది.
రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news