Tapsee Pannu : ఓర చూపులతో గాలమేస్తున్న సొట్టబుగ్గల సుందరి

-

తాప్సీ పన్ను.. ఈ దిల్లీ క్యూటీ ప్రస్తుతం బాలీవుడ్​లో తన హవా చాటుతోంది. టాలీవుడ్​లో ఝుమ్మంది నాదం సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. అనంతరం తన మకాం ముంబయికి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్​గా ఎదిగింది.

ఈ దిల్లీ డాల్ బాలీవుడ్​లో తన వైవిద్యాన్ని చూపిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్ రోల్స్​కు హీరోలతో సమానంగా ప్రాధాన్యం కల్పించేలా చేసింది. హీరోలతో సమాన ప్రాధాన్యమున్న పాత్రలకే ఈ భామ జై కొడుతోంది.

తాప్సీ గ్లామర్ పాత్రల్లో కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటోంది. తాజాగా తాప్సీ పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ శారీలో తాప్సీ చాలా అందంగా కనిపిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోల్లో తాప్సీ నడుం అందాలు చూపిస్తూ విరహవేదనతో కూడిన పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ సొట్టబుగ్గల సుందరి ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాప్సీ తెలుగులోనూ సినిమాలు చేయొచ్చు కదా అంటూ గారాలు పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news