మహిళలకు ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. అలానే వయసు అయ్యే కొద్దీ శారీరకంగా మార్పులు తో పాటు హార్మోన్లలో మార్పులు కూడా ఉంటాయి. అలానే 30 ఏళ్లు దాటిన వాళ్లకి మెటబాలిజం స్లో అవుతుంది. 30 ఏళ్ళు వచ్చే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పద్ధతులని పాటిస్తే 30 ఏళ్లు దాటిన ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రోటీన్స్ ని ఎక్కువగా తీసుకోవడం:
వయసు పెరిగే కొద్దీ మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డైట్ లో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. దాని వల్ల మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. తక్కువ ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కండరాలలో బలహీనత ఏర్పడుతుంది. అలానే డైట్ లో సరైన కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవాలి.
క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం:
30 ఏళ్లు దాటిన మహిళలు క్యాల్షియం కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని క్షీణించకుండా కాపాడుతుంది. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం తో పాటు రాగి, నట్స్, గింజలు, బ్రోకలీ వంటివి కూడా డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం:
ఫైబర్ ని కూడా డైట్ లో ఉండేటట్లు చూసుకోండి. ఫైబర్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండుతుంది మరియు ఎక్కువ కాలం జీవించడానికి బాగా ఉపయోగ పడుతుంది. కాబట్టి 30 ఏళ్లు దాటిన మహిళలు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ఉప్పు తగ్గించండి:
ఉప్పుని వంటల్లో ఎక్కువగా ఉపయోగించడం వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువ ఉప్పుని వాడండి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల సేపు నిద్ర పోవడం, హైడ్రేట్ గా ఉండడం, వాకింగ్ చేయడం, ఒమేగా త్రీ ఫ్యాట్స్ ను మీ డైట్ లో చేర్చడం చేస్తే మీరు మరెంత ఆరోగ్యంగా ఉండొచ్చు.