హ్యాండ్ శానిటైజర్స్ ను వాడటం వలన నష్టాలూ ఉన్నాయా…?

ఈ మధ్య కరోనా మహామ్మారి వల్ల శానిటైజర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని మీదే ఆధారపడిపోతూ రోజుకు అనేక మార్లు ఉపయోగించడం జరుగుతోంది. అయితే హ్యాండ్ శానిటైజర్స్ ను వాడటం వల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకోలేకపోతున్నారు. మరి దీని వల్ల కలిగే నష్టాలు వైపు ఒక లుక్ వేసేయండి. తరచూ హ్యాండ్ శానిటైజర్స్ ను వాడటం వలన స్కిన్ పొడిబారిపోయే ప్రమాదం ఉంది. స్కిన్ పై క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదండి హ్యాండ్ శానిటైజర్స్ ను వాడటం వలన మంచి బాక్టీరియా నాశనమయ్యే ప్రమాదం ఉంది. కనుక సబ్బుతో చేతులు కడుక్కుని అది అందుబాటులో లేనప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించండి.

ఇలా చెయ్యడం వల్ల కొంతలో కొంత నయమే కదా..! అలానే గాయపడిన చర్మం పై శానిటైజర్స్ ను వాడితే స్కిన్ హెల్త్ దెబ్బ తింటుంది గుర్తుంచుకోండి. శానిటైజర్స్ ను విపరీతంగా వాడుతూ ఉంటే హార్మోన్ల సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. శానిటైజర్స్ లో ఉండే కాంపౌండ్ అనేది హార్మోన్ల పని తీరు పై దుష్ప్రభావం చూపుతుందని వారు వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా ఈ హ్యాండ్ శానిటైజర్స్ లో మంచి సువాసన రావడానికి హానికర కెమికల్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. వివిధ టాక్సిక్ కెమికల్స్ తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్ ను వాడితే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త…! స్టడీస్ ప్రకారం శానిటైజర్ లో ఉండే ట్రిక్స్లోసన్ అనే పదార్థం ఇమ్యూన్ సిస్టమ్ పని తీరును డిస్టర్బ్ చేస్తుందట గమనించండి. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే శానిటైజర్ ఉపయోగాన్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. లేదంటే ఎన్నో సమస్యలు కలుగవచ్చు.