పుట్టగొడుగులు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం ఉంటుంది. వీటితో పలు రకాల వంటలు చేసుకుని చాలా మంది తింటుంటారు. పుట్టగొడుగులతో చేసే ఏ వంటకమైనా భోజన ప్రియులకు నచ్చుతుంది.
పుట్టగొడుగులు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం ఉంటుంది. వీటితో పలు రకాల వంటలు చేసుకుని చాలా మంది తింటుంటారు. పుట్టగొడుగులతో చేసే ఏ వంటకమైనా భోజన ప్రియులకు నచ్చుతుంది. ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులు శాకాహార ప్రియులకు కూడా ఎంతగానో నచ్చుతాయి. అయితే పుట్టగొడుగుల్లో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలతోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. ఈ క్రమంలోనే పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మన శరీరంలో వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
2. పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ తో బాధపడే వారు వీటిని తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
3. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
4. పుట్టగొడుగుల్లో మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యలను పోగొడుతుంది.
5. పుట్టగొడుగులలో ఉండే ఐరన్ అనీమియా ఉన్న పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో రక్తం పెరిగేలా చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.
6. ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో పుట్టగొడుగులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
7. బరువు తగ్గాలనుకునేవారికి కి పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే సెలీనియం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. వృద్ధాప్య ఛాయలను అంత త్వరగా రానివ్వదు. దీంతో ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
8. పుట్టగొడుగులలో ఉండే కాపర్, పొటాషియం వెంట్రుకల సాంద్రతను పెంచి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల ఫ్లూ జ్వరం, ఆటలమ్మ తదితర వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ లభిస్తుంది.
9. బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పుట్టగొడుగులకు ఉంటుంది. పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పైన చెప్పిన ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు.