మరమరాలతో చేసిన ఐటమ్స్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. వీటితో చేసే లడ్డూలు అయితే భలే ఉంటాయి కదా.. ఇంకా సాయంత్రం వేళ్లలో వీటితో చేసే స్నాక్స్ కూడా బాగా తినేయొచ్చు. హాస్టల్స్ కూడా వీటిని ఈవినింగ్ పెడుతుంటారు. ఆకలితీరినట్లే ఉంటుంది కానీ.. తీరదు. కానీ పొట్టకు సరిపోయిన ఫీల్ అయితే వస్తుంది. మరమరాల్లో పోషకవిలువలు చాలా ఉన్నాయి. వీటిల్లో విటమిన్ డి, విటమిన్ బి లతో పాటు క్యాల్షియం, ఐరన్ శాతం కూడా ఎక్కువగానే ఉంది. అయితే అందరూ మరమరాలు టైంపాస్ అనుకుంటారు.. కానీ ఇందులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి తినేవారు అవి తెలుసుకోవాలి కదా.. తెలియాలంటే.. ఈ ఆర్టికల్ మొత్తం చదవాలి కదా..!
మరమరాలు చాలా తేలినకైన ఆహారం. తక్కువ కేలరీలుంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుంది. మరమరాలతో తయారైన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
పిల్లల ఎదుగుదలలో మరమరాలు పాత్ర కూడా ఉంది. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు మరమరాలు చాలా మంచివి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. అందుకని కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంతో మరమరాలతో తయారయిన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మంచిది.
మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సోడియం తక్కువగా ఉండే మరమరాలను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది. పిల్లలో రక్తహీనత సమస్య సాధారణంగా ఉంటుంది. మరమరాల్లో ఐరన్ కంటెట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పిల్లలకు క్రమంతప్పకుండా ఇస్తే రక్తవృద్ధి జరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు మరమరాలతో చేసిన స్నాక్స్ ఇస్తే నీరసం, అలసట వంటి సమస్యలు దూరమై యాక్టీవ్ గా ఉంటారు.
మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. మరమరాలతో పాయసం, లడ్డూ, ఛాట్ వంటివి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మరమరాలు, వేయించిన పల్లీలు, టమాటా, కొత్తిమీర, నిమ్మకాయ రసం కలిపి సాయంత్రం వేళల్లో స్నాక్స్ గా చేసుకుని తినొచ్చు..
చూడ్డానికి చాలా లైట్ వెయిట్ ఉంటాయి.. కానీ పోషకవిలువులు, లాభాలు మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి కదా..!
-Triveni Buskarowthu