ఈ కరోనా వచ్చినప్పటి నుంచి.. పసుపు, కషాయాల వాడకం ఎక్కువైపోయింది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. ఇది వైరస్ మీద పోరాడుతుంది. చలికాలం పసుపు ఎక్కువగా వాడినా పెద్ద ప్లాబ్లమ్ కాదు కానీ.. ఎండాకాలం పసుపు విపరీతంగా వాడొద్దంటున్నారు నిపుణులు. పసుపు ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి వేసవిలో పసుపు ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవేంటో చూద్దాం.
కిడ్నీలో రాళ్లు- వేసవిలో పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పసుపులో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం కరిగిపోకుండా చేస్తుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందట.
కడుపులో మంట- పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, తిమ్మిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. వేసవిలో పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. కూరల్లో తప్ప.. పసుపును విడిగా తినవల్సిన అవసరం లేదు.
వాంతులు, విరేచనాలు- వేసవిలో పసుపు ఎక్కువగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉందట.. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఫలితంగా.. మందికి వాంతులు. విరేచనాలు కూడా మొదలవుతాయి. కాబట్టి వేసవిలో పసుపును మితంగానే తీసుకోవాలి.
రక్తాన్ని పల్చగా మార్చవచ్చు- పసుపులో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉన్నాయి. పసుపులో కర్కుమిన్ అనే మూలకం వల్ల… ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, అధిక పసుపు తినకూడదు. దీని కారణంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కలిగే ఛాన్స్ ఉంటుంది. బలహీనంగా అవుతారు.
గర్భిణీలకు ప్రమాదం- పసుపు లేదా వేడి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు, శిశువుకు హానికరం.. దీంతో ప్రెగ్నెన్సీ ప్రారంభంలో రక్తస్రావం సమస్యలు లేదా గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గర్భిణీలు పసుపు వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పరిమాణంలో తీసుకోవాలో వైద్యులను సంప్రదించన తర్వాతే వాడుకోవాలి.
పసుపు వాడటం మంచిదే కదా అని ఎడాపెడా వాడితే ఈ సమస్యలన్నీ వచ్చే ప్రమాదం ఉంది.. కాబట్టి మితంగానే వాడదామా..!