ఒత్తిడిని తగ్గించే ఎసెన్షియల్ ఆయిల్స్ కొంటున్నారా? ఐతే అది వాడే విధానం తెలుసుకోండి.

అరోమాథెరపీ.. సువాసన వెదజల్లే మొక్కల నుండి తీసుకున్న ఆయిల్ తో చికిత్స చేయడం. ఈ సువాసనలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ లో ప్రధానంగా, లావెండర్, పిప్పర్మెంట్, టీ ట్రీ, శాండల్ వుడ్, సిట్రోనెల్లా ప్రధానమైనవి. రోజువారి ఒత్తిళ్ళ నుండి ఈ ఆయిల్స్ దూరం చేస్తాయి.

పిప్పర్మెంట్ ఆయిల్స్ తక్షణ శక్తిని ఇవ్వడంలో తోడ్పడుతుంది. అలాగే ఒత్తిడిని దూరం చేయడంలో లావెండర్ ఉపయోగపడుతుంది. చిన్న చిన్న సూక్ష్మక్రిములని నాశనం చేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో సిట్రోనెలా సాయపడుతుంది.

ఐతే ఈ ఆయిల్స్ ని ఎలా వాడాలనేది చాలా మందికి తెలియదు. ఈరోజు ఎసెన్షియల్ ఆయిల్స్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం. అదీగాక ఆయిల్ కొనే ముందు కొన్ని ముఖ్య విషయాలని పరిగణలోకి తీసుకోవాలి.

ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ దాన్ని సరిగ్గా వాడడం తెలియకపోతే హానికరం అయ్యే ప్రమాదం ఉంటుంది.

మందులకి బదులుగా ఆయిల్స్ వాడుతారు కాబట్టి, కొన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. జుట్టుకి పట్టించాలని అనుకున్నప్పుడు కేరియర్ ఆయిల్ తో పాటు వాడడం మంచిది. కేరియర్ ఆయిల్స్ ఎసెన్షియల్ ఆయిల్ గాఢతని తగ్గించడమే కాదు, చర్మానికి సరిగ్గా అందేలా చేయడంలో ఉపయోగపడుతుంది. గాఢత ఎక్కువగా ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ ని వాడడం వల్ల చర్మానికి ఇబ్బంది కలగవచ్చు.

కేరియల్ ఆయిల్స్ లో కొబ్బరినూనె, జోజోబా ఆయిల్స్ వాడుకోవచ్చు. బాదం నూనె వాడుకున్నా మంచిదే. ఈ కేరియర్ ఆయిల్స్ వాడుతున్నప్పుడు కూడా అది మీ చర్మానికి సూట్ అవుతుందో లేదో తెలుసుకోండి. జుడ్డు చర్మం ఉన్నవారు కొబ్బరినూనె వాడితే చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది.

ఎసెన్షియల్ ఆయిల్ కి ఎంత నిష్పత్తిలో కేరియర్ ఆయిల్ కలపాలనేది తెలుసుకోవాలి. 15చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కి ఒక టేబుల్ స్పూన్ కేరియర్ ఆయిల్ కలుపుకోవాలి.

ఎసెన్షియల్ ఆయిల్ కొనేటపుడు EOBBD అన్న లేబుల్ ఉన్న వాటినే కొనండి. “Essential oil Botanically and Biochemically Defined ద్వారా టెస్ట్ చేసిన ఆయిల్స్ తీసుకోవడమే కరెక్ట్.