శరీరంలో వ్యర్థాలను బయటకు పంపాలంటే. మల, మూత్ర విసర్జనలు సక్రమంగా జరగాలి. అయితే ఇవి రోజుకు ఎన్నిసార్లు జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యం.. అటు తక్కువ అయినా సమస్యే.. ఇటు ఎక్కువైనా ఇబ్బందే..రోజులో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటే మాత్రం అది ఆరోగ్య లక్షణం కాదు.. కొన్ని మార్పులు చేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కవగా తాగినా సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది. కానీ నీరు తీసుకోని సమయంలో కూడా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతి మూత్ర విసర్జన సమస్యగా భావించాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారవడానికి కారణం అవుతాయి. కనుక కొన్ని రకాల ఆహార నియమాలను పాటించడం వల్ల మనం ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
సిట్రస్ అధికంగా ఉండే నారింజ, నిమ్మ, బత్తాయి, ఫైనాఫిల్, ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. కనుక అతి మూత్ర విసర్జనతో బాధపడే వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రాశయంపై ఒత్తిడిని కలిగించే శీతల పానీయాలను తీసుకోకూడదు. అలాగే కెఫిన్ కలిగే ఉండే టీ, కాఫీలను, ఎనర్జీ డ్రింక్, చాక్లెట్ లను కూడా తీసుకోకూడదు. ఖర్జూరాలను ఎక్కువగా తినటం వల్ల కూడా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.చీజ్ కలిగిన పదార్థాలను, పుల్లటి రుచి కలిగి ఉండే క్రీములను తీసుకోవడం వల్ల మూత్రాశయం పై ఒత్తిడి అధికమయ్యి తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మూత్రంలో మంట, నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
అతి మూత్ర వ్యాధితో బాధపడే వారు ఆల్కహాల్‌ను తీసుకోకపోవడమే మంచిది. అలాగే వీరు పచ్చి టమాటాలను, పచ్చి ఉల్లిపాయను, చక్కెరను కూడా ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.. బెర్రీల్లో కూడా ఆమ్లాల శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తినగానే మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. ఇవి తినడం వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది.
నిత్యం తినే ఆహారాల్లో మసాలాలను తగ్గించాలి. ఈ ఆహార నియమాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా మంది మూత్రవిసర్జన చేయకుండా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు.