చలిగా ఉందని కాళ్లు దుప్పటిలో పెట్టే నిద్రపోతున్నారా..?

-

వర్షాకాలం స్టాట్‌ అయింది. ఊళ్లో అయితే ఇంకా పెద్దగా వానలు పడటం లేదు కానీ.. హైదరాబాద్‌లో అయితే వెదర్‌ బాగుంది. రాత్రుళ్లు అయితే కొన్నిసార్లు చలికూడా పెడుతుంది. సాధారణంగా చలికాలంలో అందరూ దుప్పటి మొత్తం కప్పుకోని పడుకుంటారు. కాళ్ల నుంచి తల వరకూ మొత్తం దుప్పటితో దిగ్బంధించుకుంటారు. అలా పడుకుంటేనే వాళ్లకు హాయిగా నిద్రపడుతుంది. అయితే నిపుణులు ఏం అంటున్నారంటే.. కాళ్లను దుప్పటి బయటే ఉంచాలంటే.. మొత్తంగా కప్పేసుకోవద్దు అంటున్నారు..!

కాళ్లకు కూడా దుప్పటి కప్పుకుని పడుకునే అలవాటు ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదట. పాదాలను దుప్పటితో కప్పుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీనివల్ల మనం చాలా అప్రమత్తంగా ఉంటాం, అదే పాదాలకు దుప్పటి వేయకపోతే పాదాలు చాలా త్వరగా చల్లబడతాయి. ఇది మనం చాలా నిద్రపోయేందుకు ఉపయోపడుతుంది. అందుకే పాదాలను దుప్పటి బయట పెట్టి నిద్రపోవాలి.

నిద్ర, ఉష్ణోగ్రత మధ్య సంబంధం ఉంటుంది. దుప్పటి వెలుపల మీ కాళ్ళు పెట్టి పడుకోవడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. మీరు బాగా నిద్రపోతారు. నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే, బాగా నిద్రపోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి. దుప్పటిలోంచి కాళ్లు బయటపెట్టి పడుకుంటే జలుబు చేస్తుందని అనుకుంటే పొరపాటే. ఇలా పడుకోవడం వల్ల జలుబు రాదు, నిద్ర బాగా వస్తుంది. చలిలో కూడా ఇలా పడుకుంటే బాగా నిద్ర పడుతుంది. కొంతమంది అయితే సాక్సులు కూడా వేసుకుంటారు. ఇది ఇంకా చెడ్డ అలవాటు. ఏ సీజన్‌లో అయినా బాడీ నిద్రపోయేప్పుడు కూల్‌గానే ఉండాలి. చలికాలం కదా అని మీరు మిమ్మల్ని మరీ వేడిగా చేసుకుంటే అర్ధరాత్రిలో మెలుకోవాల్సి వస్తుంది. కొంతమందికి నిద్రపోతున్నా కూడా సడన్‌గా మెడ దగ్గర, వీపు భాగంలో చెమటలు పడుతుంటాయి. ఇది మీ శరీరం హీట్‌ అవ్వడం వల్లే జరుగుతుంది.

అసలే ఈరోజుల్లో నిద్రపట్టక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 25 ఏళ్లు దాటిన ఏ అబ్బాయి కూడా అలారం పెట్టుకోని మరీ నిద్రలేవక్కర్లేదు. వాళ్లకు ఉండే టెన్షన్స్‌, ఒత్తిడి, సమస్యల వల్ల ఆటోమెటిగ్‌గా లేస్తారు. అలా ఉంది బయట పరిస్థితి. కాబట్టి పడుకునే ఆ కాస్త సేపైనా.. ఇలాంటి మిస్టేక్స్‌ చేయకుండా ఉంటే హాయిగా నిద్రపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news