ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అందరిని బాధిస్తుంది. దీని నుంచి బయట పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే త్వరగా బరవు తగ్గాలనే ఆలోచన మంచిది కాదు. త్వరగా వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు కానీ.. అంతే త్వరగా లాస్ అవడం సాధ్యం కాదు. ఒకవేళ మీరు అలా చేసి తగ్గినా.. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో, ఎందుకు మంచిది కాదో చూద్దాం.
బరువు తగ్గడం మంచిదే. కానీ తక్కువ సమయంలో తొందరగా బరువు తగ్గాలనే ఆలోచన మాత్రం మంచిది కాదు. ఇలా వేగంగా బరువు తగ్గే విషయంలో అమ్మాయిలు ఎక్కువ దృష్టి పెడుతున్నారట. టీవీలలో, పేపర్ లలో వెయిట్ లాస్ టిప్స్ చూసి వాటిని అనుసరిస్తుంటారు. మరికొందరైతే చూసినవన్నీ ప్రయత్నించేస్తారు.. ఇలా వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఒకవేళ బరువు తగ్గినా అది తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే అందిస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఒక క్రమ పద్ధతి అనుసరిస్తూ బరువు తగ్గడానికి ప్లాన్ చేసుకోవాలి.
అయితే అందరి శరీరం ఒకే తీరుగా ఉండదు. ఒక్కొక్కరిదీ ఒక్కో శరీర తత్వం. మన శరీరానికి తగ్గట్టుగా డైట్ ను అనుసరిస్తూ, సరైన వ్యాయామాలను చేస్తే ఆరోగ్యంగా మన శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన పద్ధతి.
తక్కువ సమయంలో బరువు తగ్గిన వారిలో ఎలక్ట్రోలైట్ ల అసమతుల్యత , న్యూట్రీషియన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయట. పోషకాహారాలను తీసుకుంటూ సరైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నించండి.. నెలకు రెండు నుంచి నాలుగు కిలోల బరువు కన్నా ఎక్కువ తగ్గకూడదు.
అలాగే బరువు తగ్గాలని డైట్ విషయంలో అతి జాగ్రత్త అనవసరం. నోరు కట్టేసుకుని డైట్ చేస్తే శరీరంలో ఒక్కసారిగా కేలరీలు పడిపోతాయి. ఇలా చేస్తే మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇన్ని సమస్యలు వస్తాయి కాబట్టి.. త్వరగా బరువు తగ్గే కాన్సప్ట్ మనకొద్దు.. కొద్దికొద్దిగా ఆహారాన్ని తగ్గిస్తూ.. వ్యాయామాన్ని రోజురోజు పెంచుకుంటూ ప్లాన్ చేసుకుంటే.. ఎలాంటి లొల్లి లేకుండా హెల్తీ వెయిట్ లాస్ అవ్వొచ్చు. సిగిరెట్ మానేయడం మంచిదే అలా అని ఏళ్లతరబడి ఉన్న అలవాటును ఒక్కరోజులో ఆపేస్తే..అది కూడా హెల్త్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. తాగే సంఖ్య తగ్గిస్తూ. ఉంటే.. అలా కొన్ని నెలలకు పూర్తిగా మానతారు. బరువు విషయంలో కూడా అంతే..!
-Triveni Buskarowthu