ఎలక్ట్రిక్ రైస్‌కుక్కర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

-

అమ్మమ్మల కాలం : అప్పటి కాలంలో అన్నం వండాలంటే కనీసం గంట ముందు బియ్యం నానబెడుతారు. ఆ తర్వాత కట్టెలపొయ్యి మంటేసి అన్నానికి ఎసురు పెడుతారు. అన్నానికి చిల్లుల ప్లేటు మాత్రమే వాడేవారు. గంజి వంచడానికి వీలుగా ఉంటుందని. నీరు బాగా కాగిన తర్వాత నానిన బియ్యాన్ని కడిగి అందులో వేస్తారు. అది కొంతసేపటికి ఉడికి బుడగలుగా పొంగు వస్తుంది. ఆ తర్వాత చిన్నమంటతో అన్నం ఉడికేవరకు ఎదరుచూస్తారు. అన్నం ఉడికిందని నిర్థరణకు వచ్చిన తర్వాత గంజి పూర్తిగా వంచేస్తారు. తిరిగి మరలా మంటేలేని నిపుల పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచి అన్నం అంతా కదిలేలా శరవను అటూ ఇటూ కదిలిస్తారు. మరో 3 నిమిషాలకు అన్నం బిగుసుకుపోతుంది. ఆ తర్వాత అన్నం తినడానికి రెడీ అయిపోవచ్చు. అప్పట్లో అన్నం వండడానికి కట్టెల పొయ్యిను మాత్రమే ఉపయోగించేవాళ్లు.

avoid electric rice cooker
avoid electric rice cooker

ఇప్పటి తరం : కట్టెల పొయ్యి మీద మట్టికుండలో వండిన అన్నం తింటే అబ్బా ఆ రుచే వేరు. తిన్నది రుచికరంగానూ ఆరోగ్యవంతంగానూ ఉంటుంది. రోట్లో నూరే పచ్చడి తోడిన తర్వాత రోట్లోనే కొంచెం అన్నం వేసి బాగా కలిపి తిరుపతి లడ్డంతా పెద్ద ముద్దలు చేసి, అమ్మ చేతిలో పెడుతుంటే.. తిని ఎంతో రుచిరా అనాల్సిందే. ఇలా ఊహించుకుంటూ ఆనందపడకపోతే అలానే చేసుకోవచ్చు కదా అనుకుంటారు. అంత టైం ఎక్కడుంది. దోశ, ఇండ్లీ పిండి కావాలా? ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు బియ్యం, మినపప్పు నానెయ్యడం ఇంటికి రాగానే రెండు నిమిషాల్లో మిక్సీకి వెయ్యడం. వేడి వేడి అన్నంలోకి తినడానికి ఏదైనా పచ్చడి, చట్నీ కావాలా? మిర్చి, టామాట నూనెలో వేయించడం మిక్సీలో తిప్పడం. చపాతీ, పూరీలు కావాలా? ఎలక్ట్రిక్ రోటీమేకర్‌ను వాడడం. ఇలా ప్రతీదానికి కరెంట్‌ను వాడుతుంటే మానవ శరీరం కూడా ట్రాన్సఫార్మర్‌లా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదేమో. పిల్లలకైతే కట్టెల పొయ్యి అంటే ఏంటో కూడా తెలీయదు.

బ్యాచులర్స్ : ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకోవడం అంటే పెద్ద పనిగానే భావిస్తున్నారు బ్యాచులర్లు. ఉద్యోగం చేసేది అన్నం కోసమైనా డబ్బే అన్నంలా అపోహపడుతున్నారు. వీరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. రూంలో ఉండేవాళ్లకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తప్ప మరేమి ఉండదు. బియ్యం కడిగి రైస్‌కుక్కర్‌లో పెట్టామా, కర్రీస్ పాయింట్‌కు వెళ్లి కూరలు తెచ్చామా, తిని ఆఫీసుకు వెళ్లామా.. ఇదే బ్యాచులర్ల ప్రాసెస్. పోనీ రైస్ కుక్కర్లో అన్నం ఒకటే వండుకుంటున్నారాం అంటే.. లేదు.. దాన్ని ఎన్ని విధాలుగా వాడుతారో తెలుసా? ఉదయాన్నే వేడినీళ్లు అందులోనే కాచుతారు. ఆ తర్వాత అన్నం వండుతారు. అది అయిన వెంటనే పప్పును అందులోనే ఉడకబెడుతారు. ఫైనల్‌గా.. సిలిండర్ గ్యాస్‌ను ఎలా అయితే వాడుతారో అచ్చు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ను వాడి అనారోగ్యానికి గురవుతున్నారు.

కలిగే అనర్థాలు..

రైస్‌కుక్కర్‌లో వండడం వల్ల ఆహారం విషంగా మారుతుంది. మట్టిపాత్రలు వాడిన మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. ఈ రైస్‌కుక్కర్ పుణ్యమా అంటూ ఇరువై ఏండ్లకే కాళ్ల నొపులు, నడుం నొప్పి అంటూ డీలా పడిపోతున్నారు. అన్నం వండేటప్పుడు వెలుతురు, గాలి తగిలేలా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడు చాలామందిలో మార్పు వస్తుంది. పాత విషయాల వైపు మొగ్గు చూపుతున్నారు. రాగిసంకటి, రాగిజావ, జొన్న రొట్టెలు, కొర్రలతో టిఫిన్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నం వండేంత సమయం లేదనుకుంటే ఫ్రెజర్ కుక్కర్ వాడండి. చాలామంది మిక్సీని వాడినప్పుడు లేనిది రైస్‌కుక్కర్‌కు ఎందకు అన్ని నిబంధనలు అని అంటుంటారు. అది ముమ్మాటికి సరైనది కాదు. వైరే ఆహారం ఏమి తిన్నా రెండు మెతుకుల అన్నం తినందే కడుపు నిండదు. మరి అంత ఆస్కారం ఉన్న ఆన్నాన్ని కరెంటు కుక్కర్‌లో వండితే ఎలా? వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ రైస్‌కుక్కర్‌ను దూరం పెట్టండి ఆరోగ్యవంతంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news