మనం తినే చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్ ఇవి ఎక్కువగా పళ్లకు అంటుకుపోతాయి. వీటివల్ల పిల్లల్లో, పెద్దళ్లో దంతాలు పుచ్చిపోవడం, గారపట్టడం, ఊడిపోవడం, చిగుర్లు ఇన్ఫెక్షన్స్ కు గురవడం జరగుతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలాంటి వాటికి చాలామంది.. మౌత్ ఫ్రష్నర్స్, మౌత్ వాష్ లు వాడుతుంటారు. ఇవి కెమికల్స్ తో తయారు చేస్తారు కాబట్టి.. దీర్ఘకాలికంగా వాడటం మంచిది కాదు. మరి నాచురల్గా నోరు దుర్వాసన రాకుండా, దంతాలు గారపట్టకుండా చేసుకోవచ్చు. అందేంటో, సైంటిఫిక్ పరిశోధనలు ఏం చెప్తున్నాయో చూద్దామా..!
టీట్రీ ఆయిల్…చాలా చక్కగా.. మౌత్ వాషర్ లాగా పనిచేస్తుందని 2000వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ సార్లాండ్ జర్మని (University Of Saarland Germany ) వారు పరిశోధన చేసి నిరూపించారు. దీనితో పుక్కిలించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి అంటే..
ఎలా టీట్రీ ఆయిల్ ఉపయోగించాలి..?
100ml గోరు వెచ్చని నీరు తీసుకోండి. ఆ నీళ్లల్లో 10-15 డ్రాప్స్ టీట్రీ ఆయిల్ వేసేసి నోట్లో వేసుకుని పుక్కిలించండి. ఇలా చేయడం వల్ల టీట్రీ ఆయిల్ లో ఉండే Turbine4 OL అనే కెమికల్ యాంటిబాక్టీరియల్ గా పనిచేసి నోట్లో క్రిములను చంపేస్తుందట. బాక్టీరియాల కారణంగానే మనకు గార ఎక్కువగా పడుతుంది. ఇలా పుక్కిలించడం వల్ల.. చిగుళ్ల ఇన్ఫెక్షన్ రాకుండా, గారపట్టకుండా ఉంటుందట. ఇవి లేకపోతే.. నోట్లోంచి దుర్వాసన కూడా రాదు. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేసుకోవచ్చు.
ఈరోజుల్లో ఎక్కువమంది దంతాల సమస్యతో బాధపడుతున్నారు.. కారణం.. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం, స్వీట్స్ తినడం.. శీతలపానియాలు తాగడం వల్ల.. ఈ చల్లదానానికి, కెమికల్స్, షుగర్ కి ఎనామిల్ డామేజ్ అవుతుంది. దీనివల్లే పళ్లు దెబ్బతింటాయి. అలాంటి వారికి కూడా టీట్రీ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. నోటి నుంచి దుర్వాస వచ్చే వారు..కచ్చితంగా నైట్ పడుకునేముందు టీట్రీ ఆయిల్ వాటర్ తో పుక్కలించుకోవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఉదయం కూడా చేసి.. తర్వాత బ్రష్ చేసుకోవాలి. పిల్లలకు కూడా రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే.. దంత సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది.
-Triveni Buskarowthu