అన్న భార్యపై అత్యాచారం.. అసలు విషయం తెలిస్తే షాక్‌..

నేటి సమాజంలో రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. వావివరసలు మరిచి.. కామవాంఛ తీర్చుకోవడానికి మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. రూపురేఖలు ఒకేలా ఉండటంతో అన్న భార్యను సులువుగా వంచించాడు ఓ దుర్మార్గుడు. భర్తనని నమ్మించి దాదాపు 6నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. చివరకు బాధితురాలికి అనుమానం రావడంతో విషయం బయటపడింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కవలల్లో పెద్దవాడికి ఓ యువతితో పెళ్లైంది.

కొత్త జంటతో పాటు నిందితుడు, వారి కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. కవలలు ఇద్దరు ఒకేలా ఉండటంతో ఎవరు ఎవరో గుర్తించడం కొత్తవారికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇద్దరిలో పెద్దవాడికి పెళ్లైన తర్వాత కొత్తగా ఇంట్లోకి వచ్చిన యువతి ఇద్దరిలో భర్త ఎవరనే విషయం గుర్తించలేకపోయింది. ఆమె పరిస్థితిని అదనుగా తీసుకున్న మరిది వదినపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. అన్న ఇంట్లో లేని సమయంలో వదినతో లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. పోలికలు ఒకేలా ఉండటంతో బాధితురాలు తన భర్తగానే భావిస్తూ వచ్చింది. నెలల తరబడి ఈ తంతు కొనసాగింది.

చాలా రోజులకు అసలు విషయాన్ని గుర్తించిన బాధితురాలు తన భర్తకు చెప్పడంతో అతను, తమ్ముడితో సంబంధాన్ని కొనసాగించాలని సూచించాడు. విషయాన్ని వివాదం చేయొద్దని భార్యకు నచ్చచెప్పాడు. అత్తింట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా కవల సోదరులకు మద్దతు పలికారు. ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు కవల సోదరులిద్దర్ని అరెస్ట్ చేశారు. కవల సోదరులిద్దరికి ఈ వ్యవహారం ముందే తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు.