సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో మంచి ఫైబర్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు తీసుకోవడం వల్ల మంచి పోషకాలు మనకి లభిస్తాయి. దీనిని దేశి సూపర్ ఫుడ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీని వల్ల చాలా మేలు మనకి కలుగుతుంది. అయితే దీని వల్ల కలిగే మేలు కోసం ఇప్పుడు చూద్దాం…! ఆయుర్వేదం వైద్యం లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో మెటబాలిజం బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
అలానే గుండె జబ్బులు దరి చేరకుండా ఉండాలంటే ఈ గింజలు తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. ఎక్కువగా ఫలుదా, ఐస్ క్రీం, మిల్క్ షేక్, మజ్జిగ మరియు స్వీట్స్ లో కూడా దీనిని ఉపయోగిస్తుంటాం. ఈ గింజలు కనుక తీసుకుంటే బ్లడ్ షుగర్ ను అదుపు చేస్తుంది. అంతే కాదండి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు ఏడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి కూడా ఇది దివ్యౌషధంగా పని చేస్తుంది.
సబ్జా గింజల్ని ఒక బాటిల్ లో వేసి పూర్తిగా నీళ్ళ తో ఆ బాటిల్ నింపేసి కాసేపు తర్వాత చూస్తే అవి ఉబ్బి పెద్దగా అవుతాయి. వాటిని తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీనిలో ఉంటాయి. ఇవి తీసుకుంటే గుడ్ ఫాట్ ని పెంచడానికి సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి. చూసారు కదా దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో…! మరి వీటిని మీరు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడచ్చు.