హెయిర్‌ స్ట్రైటనర్‌ వాడితే గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ…తేల్చిన అధ్యయనం

-

జుట్టును ఉన్నతీరును ఉంచుకోవడం అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఎవరికీ ఇష్టం ఉండదు.. దాన్ని స్టైల్‌గా కట్‌ చేయించుకోవాలి, హెయిర్‌ స్ట్రైట్‌నర్‌తో స్ట్రైట్‌నింగ్‌ చేయించుకోవాలి.. నానా ఆగం చేయాలి..మళ్లీ జుట్టు ఊడిపోతుందని బాధపడాలి.. అయితే హెయిర్‌ స్ట్రైటనింగ్‌ చేసేప్పుడు హెయిర్‌కు ఏవేవో కెమికల్స్‌ రాస్తారు. కెమికల్ హెయిర్ స్ట్రెయిట్‌నెర్లను తరచుగా ఉపయోగించే మహిళలకు గర్భాశయ క్యాన్సర్‌ (Uterine cancer) వచ్చే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఉత్పత్తులను ఎప్పుడూ ఉపయోగించని మహిళలతో పోలిస్తే వీరిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని ఆ అధ్యయనంలో వెల్లడైంది.
యునైటెడ్ స్టేట్స్‌లో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌తో అక్కడి మహిళల కంటే నల్లజాతి మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కెమికల్ స్ట్రెయిట్‌నెర్లు కొంతవరకు క్యాన్సర్‌కు కారణమవుతాయని తెలిపింది. దాదాపు 11 ఏళ్లుగా యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ (NIEHS) పరిశోధకులు 33,947 మంది మహిళల హెల్త్‌ను ట్రాక్ చేశారు. ఈ అధ్యయన కాలంలో ఆ మహిళలలో 378 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారు. సర్వే చేయడానికి ముందు 12 నెలల్లో కెమికల్ స్ట్రెయిటనింగ్ ప్రొడక్ట్‌ని నాలుగు సార్లు వాడిన వారు ఎప్పుడూ వాడని వారితో పోలిస్తే 155% క్యాన్సర్ భారినపడే అవకాశం ఎక్కువ అని అధ్యయనంలో స్పష్టంగా తేలింది. .
హెయిర్ స్ట్రెయిట్‌నెర్లను ఎప్పుడూ ఉపయోగించని మహిళలకు 70 ఏళ్ల వయస్సులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 1.64 శాతంగా ఉంటే.. స్ట్రెయిట్‌నెర్లను తరచుగా ఉపయోగించే వారికి 4.05 శాతంగా ఉందట.. అంటే రెట్టింపు కంటే ఎక్కువగా ముప్పు వీరికే ఉందని నేషనల్ స్టడీ చెప్తుంది.
మహిళలందరిలో నల్లజాతి మహిళలపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని ఈ అధ్యయనంలో తెలుసుకున్నారు. రీసెర్చర్ల ప్రకారం.. హెయిర్ స్ట్రెయిట్‌నెర్లను ఉపయోగించినట్లు చెప్పిన పార్టిసిపెంట్లలో 60 శాతం మంది నల్లజాతీయులు ఉన్నారు. పారాబెన్లు, బిస్ఫినాల్ ఎ, లోహాలు, ఫార్మాల్డిహైడ్ వంటి స్ట్రెయిట్‌నెర్లలోని అనేక రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంలో పాత్ర పోషిస్తాయని.. ఆ రసాయనాలలో కొన్నిటికి ఎండోక్రైన్-డిస్రప్టింగ్ కలిగించే లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. కాబట్టి మహిళలు హెయిర్‌ స్ట్రైటనర్‌ వాడకం తగ్గించడం మేలు..అందానికి పోయి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఎందుకు..?

Read more RELATED
Recommended to you

Latest news