పురాతన సహజసిద్ద ఫేస్ ప్యాక్..ఎంతమందికి తెలుసు…???

-

అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు తీసుకుని వంటికి పూసుకుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ సౌందర్య ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి చర్మానికి హానీ చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్ద పద్ధతులకే అందరూ ప్రస్తుతం మొగ్గు చూపుతూ ఉంటారు.

అయితే పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని ఉపయోగించేవారు. కానీ మొట్ట మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన సౌందర్య సాధనం ఒక్కటే అదే గంధం చెక్క, సాన రాయి, ఈ రెండిటిని ఉపయోగించి ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవడం ఎన్నో ఏళ్ళ క్రితమే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న తరానికి దీనిగురించి తెలియక పోవచ్చు కానీ ఎంతో మంది పాత తరం వారికి ఈ పద్దతిగురించి తెలుసు. దీని తయారి విధానం కూడా పెద్ద కష్టమేమి కాదు. మరి మంచి గంధం చెక్క, సాన రాయితో ఎలా ఫేస్ ప్యాక్ చేయచ్చో ఇప్పుడు చూద్దాం.

ముందుగా గంధం చెక్క, సాన రాయి, మంచి నీళ్ళు, ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. ఆ తరువాత సాన రాయిపై రెండు లేదా మూడు చుక్కలు నీళ్ళు వేసి గంధం చెక్కని అరిగించాలి. ఇలా ఆరగ దీస్తున్న క్రమంలోనే మెత్తటి గుజ్జులా గంధం వస్తూ ఉంటుంది. గట్టి పడుతున్న సమయంలోనే మరో రెండు మూడు చుక్కల నీళ్ళు పోసి కొంత మిశ్రమం వచ్చిన తరువాత దాని గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి సుమారు గంట వరకూ ఉంచాలి. ఆతరువాత చల్లటి  లేదా గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం ఎంతో మృదువుగా , మెరుపులా తయారువతుంది. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు చేస్తే ఫలితాన్ని మీరే గుర్తిస్తారు. 

Read more RELATED
Recommended to you

Latest news