మామిడి తొక్కలతో ఈ సమస్యలు దూరం..!

మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. అయితే మామిడి పండ్లు తినేసి ఆ తొక్కలని పారేస్తూ ఉంటాము. కానీ ఈ మామిడి తొక్క ల వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతున్నాయి. అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మరి ఆలస్యమెందుకు మామిడి తొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

 

benefits of mango peel | మామిడి తొక్క బెనిఫిట్స్
benefits of mango peel | మామిడి తొక్క బెనిఫిట్స్

చాలా మంది మహిళలు అందంగా ఉండడానికి అనేక పద్ధతులని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అందాన్ని మరింత పెంచుకోవడానికి మామిడి తొక్కలు బాగా ఉపయోగపడతాయి దీని కోసం మీరు కొన్ని మామిడి తొక్కలు తీసుకుని పేస్టులాగ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటే యాక్నీ, ముడతలు తొలగిపోతాయి.

మామిడి తొక్క ల ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం:

మీరు దీని కోసం కొన్ని మామిడి తొక్కలని తీసుకుని ఎండలో ఎండబెట్టండి.
కొన్ని రోజుల వరకు మీరు ఎండలో ఎండ పెట్టొచ్చు.
ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి.
కొద్దిగా పెరుగు కాని రోజు వాటర్ కాని దానిలో కలిపి ముఖానికి అప్లై చేసుకోండి.

ఇలా ఈ ఫేస్ ప్యాక్ ని మీరు రెగ్యులర్ గా ఉపయోగిస్తే డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా మీ చర్మం రంగు కూడా మీరు మార్చుకోవచ్చు. ముఖం మీద ఉండే ట్యాన్ ని తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

మామిడి తొక్కల్ని ముఖం మీద వేసి దానితో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.
కొంచెం సేపు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి.
ఇలా ట్యాన్ ని మీరు తొలగించుకోవచ్చు.

అలానే యాక్నీ, పింపుల్స్ వంటి సమస్యలు కూడా పోతాయి. చూసారా మనం పారేసే మామిడి తొక్కలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో.. మరి ఈ చిన్న చిన్న టిప్స్ ని అనుసరించి మరింత అందంగా ఉండండి.