ముఖాన్ని కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

-

స్కిన్‌ కేర్‌ గురించి అందరూ జాగ్రత్తలు తీసుకుంటారు..ఆడవారు కాస్త ఎక్కువ శ్రద్ద వహిస్తారు. అందంగా కనిపించాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది..అది ఆడవారి నైజం అనుకోండి. అయితే ఎవరైనా సరే..అందంగా ఉండాలని ఏవేవో క్రీమ్స్, ఫేషియల్స్‌ వాడుతుంటారు. ఇవి వ్రాయటంతోనే సరికాదు..అన్నింటికంటే ముఖ్యం మనం ఫేస్‌వాష్‌ చేసే పద్ధతి సరిగా ఉండాలంటున్నారు సౌందర్య నిపుణులు. సాధారణంగా..స్నానం చేసేప్పుడు ఎవరైనా..శరీరం మొత్తం కంటే..ఫేస్‌ మీద కాస్త ఎక్కువ శ్రద్ద పెడతారు..ఇంకా రోజులో కూడా నాలుగు ఐదు సార్లు ఫేష్‌ వాష్‌ చేస్తుంటారు. ఎంత క్లీన్‌గా ఉంచినా..ముఖం పై మొటిమలు మాత్రం వస్తుంటాయి. చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇలా జరుగుతుంటుంది. ఒకటి మనం తీసుకునే ఫుడ్‌ అయితే మరొకటి ముఖం క్లీన్‌ చేయటంలో చేసే తప్పులు. ఈరోజు ముఖాన్ని కడిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చేయకూడని తప్పులు తెలుసుకుందాం.

మీరు ఒకే టవల్‌తో శరీరాన్ని , ముఖాన్ని శుభ్రం చేస్తుంటే..ఆ అలవాటు మానుకోండి. అది మీ ముఖానికి మంచిది కాదు. ఇలా చేస్తే టవల్‌లో ఉండే బ్యాక్టీరియా ముఖంపైకి వచ్చి చర్మంపై మచ్చలు, మొటిమలను కలిగిస్తుంది. అందుకే ముఖాన్ని తుడచుకునేందుకు సెపరేట్‌గా సాఫ్ట్‌గా ఉండే టవల్ ఉపయోగించాలట.

ముఖాన్ని శుభ్రపరిచేటప్పుడు బాగా క్లీన్‌ అవ్వాలనో, తెల్లగా రావాలనో..ఓ రుద్దేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూదు. చెంపలపై బలం ప్రయోగించకూడదు. సున్నితంగా మర్దన చేయాలి. అలా చేస్తే ముఖంపై ఉండే మజిల్స్‌ లూస్‌ అయి ముడతల్లా ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

చలికాలంలో గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయడం మంచిదే. కానీ కొందరు బాగా వేడిగా ఉన్న నీళ్లతో ముఖాన్ని కడుగుతుంటారు. ఇలా చేస్తే ముఖంలోని మెరుపు తగ్గిపోయి ..త్వరగా ముడతలు కూడా వస్తాయి. ముఖానికి వేడినీళ్లు మంచిదికాదు. అలా అని బాగా కూల్‌ వాటర్‌ కూడా మంచిదికాదు. చల్లగా లేకుండా కాస్త గోరువెచ్చిన నీటిని మాత్రమే ముఖాన్ని క్లీన్‌ చేయడానికి వాడాలి.

ఎక్కువ వేడి నీళ్లే కాదు.. చల్లగా ఉంటే నీటితోనూ ముఖం కడగకూడదు. చల్లనీ నీటితో ముఖాన్ని కడగడం వల్ల, చర్మ రంధ్రాలు శుభ్రం కావు. తద్వారా ముఖంపై మురికి పేరుకుపోతుంది. ఇది మొటిమలు, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఇంకా స్కిన్‌ పొడిబారుతుంది కూడా.

పైన చెప్పిన పొరపాట్లు మీరు చేస్తుంటే..ఓ సారి మానేయడానికి ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news