ముఖంపై మచ్చలని తొలగించే సులువైన పద్ధతులు ఇవే..!

-

చాల మందికి ముఖం పై మచ్చలు ఉంటాయి. వీటిని తొలగించడం సవాల్ అయిపోతుంది. ముఖం పై మచ్చలు తొలగి పోవాలంటే మొదట రోజుకు రెండు, మూడు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మరచి పోకండి. అలానే కొన్ని టిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 ఒక కప్పు లో ఆర స్పూన్ నిమ్మరసం, కొంచెం గ్లిజరిన్ వేసి కలిపి ఎక్కడ మచ్చలు ఉంటె అక్కడ అప్లై చెయ్యండి. ఈ పద్దతిని వారం లో రెండు సార్లు రిపీట్ చేసినా పరవాలేదు. మార్పు మీకే కనపడుతుంది.

2 మచ్చలని తగ్గించడానికి నిమ్మ తొక్కల పొడిని పచ్చి పాల లో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇవి ఆరిన తర్వాత శుభ్ర పరుచుకోవాలి. వీటిని కనుక మీరు వారానికి రెండు సార్లు రీపీట్ చేస్తే మొటిమలు, వాటి తాలూకు నల్ల మచ్చలు కూడా తగిపోవడమే కాక నిగారింపు కూడా వస్తుంది.

3 మచ్చలు పోవాలంటే గోరింటాకు పేస్ట్ లో కొద్దిగా పసుపు కలిపి మచ్చలు ఉన్న ప్రదేశం లో రాస్తే తొందరగా తగ్గుతాయి.

4 వేపాకు పొడి, పుదీనా పొడి, పసుపు, రోజ్‌వాటర్, ఎండిన తులసి ఆకుల పొడి తీసుకుని బాగా కలపాలి. పేస్ట్‌ లాగ చేసుకుని… మచ్చలపై రాస్తే నల్ల మచ్చలు పూర్తిగా తగ్గి పోతాయి.

5 సిట్రస్ జాతి పండ్లు కూడా ఈ మచ్చలని పోగొట్టడం లో బాగా సహాయపడతాయి. నిమ్మ రసం లో కాటన్ ముంచి మచ్చల పై రాస్తే ఎటువంటి మచ్చలైన మాయం అయి పోతాయి. కనుక ఈ పద్ధతిని కూడా ఫాలో అవ్వొచ్చు. మచ్చలని కూడా వేగంగా తగ్గించుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news