పుదీనాతో అందమైన ముఖం.. మొటిమలు మాయం.. ఇంకా ఎన్నో..!

-

వంటింట్లో విరివిగా వాడే పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది. కేవలం పుదీనాతో కాకుండా.. దీనికి మరికొన్ని పదార్థాలు కలిపితే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటించొచ్చు. ఈ పుదీనాతో చర్మాన్ని మెరిపించొచ్చు. మచ్చలనూ తొలగించుకోవచ్చు.. సులభంగా లభ్యమయ్యే ఈ పుదీనాతో ఏమేం చేయవచ్చో ఓసారి చూద్దాం.

యవ్వనంలో మొటిమెలు అందరినీ వేధించే సమస్య.. మొటిమలు తగ్గిపోయినా వాటి గుర్తులుగా మచ్చలు మిగిలిపోతాయి. అంతే కాదు. దోమకాటు వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి మనకు పుదీనా పనికొస్తుంది. ఎలాగంటే.. పుదీనా ఆకులను ముద్దలా చేసి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపాలి. ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

mint plant grow at vegetable garden,mint.

పుదీనాతో చర్మాన్ని మెరిపించుకుని కాస్త వయస్సు తగ్గించుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకోవడమే. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే.. వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయి. ఈ పుదీనా పూత రక్త ప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది. అంతే కాదు.. కంటి కింద నల్లటి వలయాల సమస్య అదుపులోకి వస్తుంది.

ఇంకా.. పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్ టీ వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని చేతులు, మెడకు పూతలా వేస్తే… కాలుష్యం కారణంగా పేరుకున్న మురికి వదిలిపోతుంది. చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

ఇంకా ముఖంపై జిడ్డు తగ్గించుకునేందుకు కూడా ఈ పుదీనా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టిలో సరిపడా పుదీనా రసం కలపాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు వారంలో రెండుసార్లు దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎక్కువ నూనెలను స్రవించదు.

పెరుగు, పుదీనా ఆకుల మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే.. చర్మం తేమను సంతరించుకుంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది. గులాబీనీరు, తేనె, పుదీనా ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని మొటిమలపై రాసి… మర్దన చేసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news