రాత్రిపూట తొందరగా భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా..?

-

ఏ సమయంలో ఎంతగా తినాలనేది ఆరోగ్యానికి సంబంధించిన అతి ముఖ్యమైన నియమం అని అని చాలా మందికి తెలియదు. వేళ కాని వేళలో, తినకూడనంతగా తినడం అనారోగ్యానికి దారి తీయవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట చాలా తొందరగా తినాలి. అప్పుడే రాత్రి అయిందన్నప్పుడే భోజనం చేసేస్తే చాలా మంచిది. రాత్రిపూట తొందరగా భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇప్పుడే తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

భోజనం చేయడానికి, నిద్రపోవడానికి మధ్య సమయం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లేదంటే మీరు తిన్న ఆహారం జీర్ణం అవడం కష్టమవుతుంది. నిద్రలో పనేమీ ఉండదు కాబట్టి అది జీర్ణం కాదు. అందుకే తిన్నాక కనీసం రెండు నుండి మూడు గంటల సమయం తర్వాతే పడక ఎక్కాలి.

బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట తొందరగా తింటే బాగుంటుంది. మీ రోజు వారి దినచర్యలో రాత్రిపూట తొందరగా తినకుండా ఆలస్యం చేసి, తినగానే పడుకున్నారంటే బరువు తగ్గడం కష్టం అవుతుంది. ఇలా చేస్తుంటే కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ. పొద్దున్నుండి మీరు పాటించిన అన్ని ఆహార నియమాలు ఈ ఒక్కదానితో వృధా అయిపోతాయి.

డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువ.

నిద్రపోయే ముందు ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయం ఉంటుంది కాబట్టి అది గ్లోకోజ్ గా మారుతుంది. లేదంటే అది అలా పేరుకుపోయి డయాబెటిస్ కి దారి తీస్తుంది. సో చక్కెర వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు రాత్రిపూట తొందరగా తినండి.

నిద్ర

ఆలస్యంగా తినడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంటుంది. ఆ టైమ్ లో మీరు నిద్రపోతారు. కానీ ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ మీ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. అందుకే తొందరగా భోజనం చేస్తే నిద్రపోయేసరికి జీర్ణం అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news