బొప్పాయి పండు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను సులువుగా ఇది తొలగిస్తుంది. అయితే ఈ రోజు మనం బొప్పాయి ఆకుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటి వల్ల నొప్పి వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అని నిపుణులు చెప్పారు. అలానే ఆకలి వేయకపోతే బొప్పాయి ఆకులు చాలా బాగా పని చేస్తాయి. దీని కోసం మీరు వాటి ఆకులతో టీ చేసుకుని తీసుకుంటే మంచిది.
మలేరియా వంటి సమస్యల్ని కూడా తగ్గించడానికి బొప్పాయి ఆకులు బాగా ఉపయోగపడతాయి. దీనిలో ప్లాస్మోడిస్టాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మలేరియా జ్వరంని కంట్రోల్ చేస్తుంది.
అలానే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారసైట్, క్యాన్సర్ సెల్స్ సమస్యలని కూడా తొలగిస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. డెంగ్యూ నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
పీరియడ్స్ లో వచ్చే నొప్పి నుంచి కూడా ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. జుట్టుకి మరియు చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి ఆకులతో ఈ విధంగా డికాషన్ చేసుకు తీసుకోండి:
దీనికోసం ముందుగా కొన్ని బొప్పాయి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఒక గాజు సీసాలో వేసి ఫ్రిజ్లో పెట్టుకుని తాగండి.