నిద్రలేమి వల్ల చర్మంపై కలిగే దుష్పరిణామాలు.. వాటిని అధిగమించే విధానాలు..

నిద్ర.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. రోజాంతా పనిచేసి, అలసిపోయిన శరీరానికి నిద్ర ద్వారా విశ్రాంతి చాలా అవసరం. ఐతే సరైన నిద్ర లేకపోతే చర్మంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడకుండా ఉండేందుకు సరైన నిద్ర అవసరం. శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం కాబట్టి విశ్రాంతి లేక అలసటకి గురైతే దాని ప్రభావం చర్మం మీద పడి ఇబ్బందులకి గురి చేస్తుంది.

ఒక రెండు రోజులు సరిగ్గా నిద్ర లేకపోతేనే మొహంలో దాని ప్రభావం కనిపిస్తుంది. మరి రోజూ సరిగ్గా నిద్ర లేకపొతే, దానొ ప్రభావం ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.

 

చర్మంపై గీతలు,ముడతలు ఏర్పడకుండా ఉండడానికి నిద్ర చాలా అవసరం. నిద్రలో ఉన్నప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తాయి. వాటివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

నిద్రలో ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఆ కారణంగా చర్మం మరింత నిగనిగలాడుతుంది.

నిద్ర వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా, మరి తొందరగా నిద్రలోకి జారుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి.

నిద్రపోయే మూడు గంటల ముందు భోజనం చేయవద్దు.

మీ గది ఉష్ణోగ్రత 18-20డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి.

మీరు పడుకునే గది చీకటిగా ఉండేలా చూసుకోవాలి. వెలుతురుగా ఉన్న గదిలో అంత త్వరగా నిద్ర రాదు. వచ్చినా మసక మసగ్గానే ఉంటుంది. ఆందుకే ఎంత బాగా పనిచేసావన్నది ఎంత ముఖ్యమో అంత బాగా విశ్రాంతి తీసుకోవాలని గుర్తుంచుకోండి.