బాటిల్‌ గార్డ్‌ బీపీ గార్డ్‌.. సొరకాయ తిని మరుసటిరోజు బీపీ చెక్‌ చేసుకుంటే అద్భుత ఫలితాలట..!

-

ఈరోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఎవరూ లేరు. అందరికీ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. వీటన్నింటికి ముఖ్యకారణం..సరైనా ఆహారం లేకపోవడం, కంటి నిండా నిద్రలేకపోవటం..జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం. ఈ రకమైన ఫుడ్‌కారణంగా.. చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోయిన లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఈ దుష్ప్రభావాలన్నింటి కారణంగా గుండెలయ మారుతుంటుంది. ఈ సమస్యలకు పెరట్లో పండే సొరకాయ చక్కటి పరిష్కారం అని మీకు తెలుసా. చాలామందికి సొరకాయ నచ్చదు. తినటానికి అసలు ఇష్టపడరు. కానీ అందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు కచ్చితంగా తినలానుకుంటారు. చూద్దాం అవి ఏంటో..

  • దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సమర్థంగా పని చేస్తుంది.
  • సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.
  • సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
  • సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు.
  • జుట్టు తెల్లబడిన టీనేజ్‌ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి కూడా వస్తుంది.
  • ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది.
  • ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు అలసిన దేహం సాంత్వన పొందుతుంది కూడా.
  • హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుసార్లు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది.
  • గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
  • సొరకాయ తింటే మంచి నిద్రపడుతుందట.
  • ఇది సొరకాయలు పండే కాలం. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • బాటిల్‌ గార్డ్‌ బీపీ గార్డ్‌ అని కూడా నిర్ధరణ అయింది కూడా.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న సొరకాయను ఈ సీజనల్‌ బాగా లాగించేయండి. అందులోని దీని ధరకూడా వేరే కాయగూరలతో పోల్చుకుంటే..చాలా చవక. తక్కువ ధరకే దొరికే మంచి కాయ ఇది. ఇంతకీ మీకు సొరకాయ ఇష్టమేనా.!

Read more RELATED
Recommended to you

Latest news