ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకొని తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. నిమ్మకాయల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చూస్తాయి. నిమ్మలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. వీటిలో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది.
గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తీసుకుంటే ఏం అవుతుంది..?
రోగనిరోధక శక్తి
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసుకుని తీసుకోవడం వలన విటమిన్ సి అందుతుంది. పైగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
జీర్ణ సమస్యలు
ఇలా తాగడం వలన జీర్ణ సమస్యలు కూడా నయమవుతాయి. అజీర్తి వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
హైడ్రేషన్
హైడ్రేట్ గా ఉండేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. కావాలనుకుంటే నీళ్లలో ఒక అర చెక్క నిమ్మరసం వేసి రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు.
చర్మ ఆరోగ్యం
నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
బరువు కంట్రోల్
బరువు తగ్గడానికి కూడా నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పరగడుపున ఇలా తీసుకోవడం వలన బరువు కూడా తగ్గొచ్చు.
డిటాక్సిఫికేషన్
నిమ్మ నేచురల్ డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. ఒంట్లో ఉండే టాక్సిన్స్ ని కూడా బయటకి పంపిస్తుంది. శరీరాన్ని క్లీన్ చేసేస్తుంది. రోజు పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకొని తీసుకుంటే ఇన్ని లాభాలను పొందవచ్చు. ఈ సమస్యలన్నిటికీ
చెక్ పెట్టవచ్చు.