ఖాళీ కడుపున తులసి ఆకులను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

-

ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి ఆకులు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ను పొందవచ్చు. అయితే, తులసి ఆకులను తినడం వలన ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ లు తగ్గుతాయి. కార్టిసాల్ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్. శరీరంలో కార్టిసాల్ పెరగడం వలన అలసట, నీరసం, నిద్రలేమి, రోగనిరోధక శక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి మొదలైన సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్ స్థాయిలను తగ్గించుకుంటారో, ఆరోగ్యంగా ఉండవచ్చు. తులసిలో ఉండే అడాప్టోజెన్లు ఒత్తిడిని తగ్గించడానికి సహాయం చేస్తాయి.

కనుక, ప్రతి రోజు కనీసం మూడు తులసి ఆకులను తినడం వలన 40 నిమిషాల్లోనే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా నాడీ వ్యవస్థకు కూడా ఎంతో సహాయం చేస్తాయి. ముఖ్యంగా, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడే వారికి తులసి ఆకులు ఎంతో అవసరం అని చెప్పవచ్చు. తులసి ఆకులను ఖాళీ కడుపుని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. పైగా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తప్పకుండా తీసుకోండి.

ఈ విధంగా ఉదయాన్నే తులసి ఆకులను తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలను కూడా నియంత్రించుకోవచ్చు మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలను కూడా నియంత్రించవచ్చు. తులసి ఆకులలో ఉండే పూర్తి ఆరోగ్య గుణాలను పొందాలంటే వాటిని నమ్మడం కంటే నీటి రూపంలో తీసుకోవడం మేలు. కనుక, తులసి ఆకు రసం లేక తులసి ఆకు టీ ను తయారు చేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవచ్చు. కనుక తులసి ఆకులను మరిగించి టీ ను తయారు చేసుకుని తాగడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news