బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఛాతిపై చర్మం రంగు మారుతుంది. శరీరంలో ఇతర భాగాలపై ఉండే చర్మం కలర్ కన్నా భిన్నంగా ఆ రంగు మారుతుంది.
ప్రపంచంలోని ఇతర దేశాల్లోనే కాదు, మన దేశంలోనూ ప్రస్తుతం చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే నిజానికి చాలా మంది మహిళలకు తాము బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలియదు. దీంతో వ్యాధి ముదిరాక దాని గురించి వారు తెలుసుకుంటున్నారు. అనంతరం ప్రాణాంతక స్థితికి వారు చేరుకుంటున్నారు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఆరంభంలో గుర్తిస్తే దానికి చికిత్స తీసుకోవడం ఎంతో సులభతరం అవుతుంది. ఈ క్రమంలోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉందని తెలిపే పలు లక్షణాలు మహిళల్లో కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకోవడం చాలా సులభతరం అవుతుంది. మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉంటే మహిళల్లో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉంటే.. వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్లు గుర్తించాలి.
2. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఛాతిపై ఉన్న చర్మం లోపలికి పోతుంది. చర్మం సొట్టలు పడుతుంది.
3. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఛాతిపై చర్మం రంగు మారుతుంది. శరీరంలో ఇతర భాగాలపై ఉండే చర్మం కలర్ కన్నా భిన్నంగా ఆ రంగు మారుతుంది.
4. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి ఊడి వస్తుంది.
5. నిపుల్స్‌ను ప్రెస్ చేసినప్పుడు సరిగ్గా లోపలికి పోకపోయినా లేదా నిపుల్స్ రెండు భిన్న సైజ్‌లలో ఉన్నా.. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి.
6. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగుల్లో ద్రవం బయటకు వస్తుంటుంది.
7. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రంథులు వాపులకు గురవుతాయి. దీంతో ఆ భాగాల్లో వాపు కనిపిస్తుంది.