అండర్ 19 ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్…!

-

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. టీం ఇండియా విజయం ముంగిట బోల్తా పడింది. 3వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాట్స్మెన్ వైఫల్యంతో 47 ఓవర్లలో 177 పరుగులు చేసిన భారత జట్టు ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ ఆటగాళ్ళు పట్టుదలగా రాణించడంతో టీం ఇండియా ఫైనల్ లో ఓటమి పాలైంది. దీనితో ప్రపంచకప్ ఫైనల్ కి వెళ్ళిన తొలిసారే బంగ్లా జట్టు కప్ ని సగర్వంగా ఎత్తుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు… ఆదిలోనే టీం ఇండియాను దెబ్బ కొట్టింది. 6వ ఓవర్ 4 బంతికి ఓపెనర్ సక్సేనా వికెట్ తీసింది. వెంటనే కోలుకున్న భారత జట్టు నింపాదిగా ఆడింది. ఓపెనర్ జైస్వాల్, వన్ డౌన్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ జట్టుని ఆదుకున్నారు.

ఎక్కడా కూడా బంగ్లాదేశ్ కి అవకాశం ఇవ్వకుండా స్లోగా ఆడారు. చెత్త బంతులను ఫోర్లుగా తరలిస్తూ స్కోర్ బోర్డు ని ముందుకి నడిపించారు. ఈ క్రమంలో జైస్వాల్ టోర్నీలో మరో అర్ధ సెంచరి నమోదు చేసాడు. ఈ తరుణంలో తిలక్ వర్మను సకిబ్ అవుట్ చేయడంతో భారత స్కోర్ బోర్డు మళ్ళీ నెమ్మదించింది. తిలక్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ ప్రియం గార్గ్ 7 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన కీపర్ ధృవ జురెల్ జైస్వాల్ కి అండగా నిలిచాడు. ఇద్దరు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ తరుణంలో నాలుగో వికెట్ గా జైస్వాల్ 121 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 88 పరుగులు చేసి అవుటైన తర్వాత భారత జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. దీనితో భారత జట్టు 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ఆ తర్వాత 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకి ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసారు. ఈ తరుణంలో రవి బిష్ణోయ్ టీం ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. 17 పరుగులు చేసిన ఓపెనర్ త్యాగీకీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మహ్మద్ జాయ్ (8), హ్రిదోయ్ (0), హస్సన్ (1), వెంటవెంటనే అవుట్ అయ్యారు.

దీనితో టీం ఇండియా విజయం లాంచనం అయిందని భావించారు. అయితే వికెట్లు పడుతున్నా పర్వేజ్ ఎమోన్ మాత్రం ఒంటరి పోరాటం చేసాడు. ఈ తరుణంలో గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షమీం హసన్, అవిషేక్ దాస్ తో కలిసి అక్బర్ అలీ జాగ్రత్తగా ఆడాడు. ఈ తరుణంలో ఆ ఇద్దరు వెనుతిరిగారు. వాళ్ళ అవుట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఓపెనర్ పర్వేజ్ ఎమోన్ కి అక్బర్ అలీ అండగా నిలిచాడు.

ఇద్దరూ కలిసి 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ తరుణంలో జైస్వాల్ బ్రేక్ ఇచ్చాడు. 79 బంతుల్లో 47 పరుగులు చేసి అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న ఎమోన్ ని జైస్వాల్ అవుట్ చేసాడు. ఎమోన్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రకిబుల్ హసన్ తో కలిసి అక్బర్ అలీ జాగ్రత్తగా ఆడుతూ విజయం దిశగా నడిపించాడు. ఈ తరుణంలో వచ్చిన అదనపు పరుగులు బంగ్లాదేశ్ కి లాభించాయి.విజయానికి 54 బంతుల్లో 15 పరుగులు అవసరమైన తరుణంలో వర్షం పడింది.దీనితో డక్ వర్త్ లూయీస్ ప్రకారం 29 బంతుల్లో లక్ష్యాన్ని ఆరు పరుగులుగా నిర్దేశించారు. దీనితో బంగ్లా జట్టు విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news